https://oktelugu.com/

Roja Ramani: తట్టుకోలేకపోయా.. అలా తరుణ్ ను చూసి ఏడుపు వచ్చేసిందన్న రోజా రమణి

సినిమాలకు దూరంగా ఉన్న తరుణ్ గతంలో జరిగిన ‘నువ్వే నువ్వే’ 20 ఏళ్ల ఫంక్షన్లో కనిపించారు. ఆ తరువాత మళ్లీ కనిపించడం లేదు. అయితే ఇటీవల ఆమె తల్లి రోజారమణి ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తి విషయాలు మీడియాతో పంచుకున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 17, 2023 / 01:28 PM IST

    Roja Ramani

    Follow us on

    Roja Ramani: తెలుగు సినిమాల్లో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు తరుణ్. ఒకప్పుడు వరుస హిట్లతో స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చారు. ఆ తరువాత పర్సనల్ గా ఆయనపై వచ్చిన రూమర్లు, సినీ ఇండస్ట్రీలో వస్తున్న మార్పుల కారణంగా ఆయన పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. తరుణ్ తల్లి రోజా రమణి కూడా నటినే అన్న విషయం చాలా మందికి తెలుసు. ఆమె స్ఫూర్తితోనే తరుణ్ చైల్డ్ ఆర్టిస్టుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల వీరిద్దరు కలిసి ఓ వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా తరుణ్ పై అప్పట్లో వచ్చిన రూమర్స్ పై స్పందించారు. తరుణ్ గురించి అలా మాట్లాడేసరికి ముందు బాధనిపించిందన్నారు. కానీ ఆ తరువాత పట్టించుకోవడం మానేశామన్నారు.

    సినిమాలకు దూరంగా ఉన్న తరుణ్ గతంలో జరిగిన ‘నువ్వే నువ్వే’ 20 ఏళ్ల ఫంక్షన్లో కనిపించారు. ఆ తరువాత మళ్లీ కనిపించడం లేదు. అయితే ఇటీవల ఆమె తల్లి రోజారమణి ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తి విషయాలు మీడియాతో పంచుకున్నారు. తరుణ్ కు చిన్నప్పటి నుంచి పూజలంటే ఎక్కువ అని, ప్రతిరోజూ గంట సేపు పూజ చేయనిదే ఏ కార్యక్రమం మొదలు పెట్టేవాడు కాదని అన్నారు. సినిమాల్లో ఉన్నంతకాలం తరుణ్ ను చూసి ఎంతో మురిసిపోయేవారమని చెప్పారు. తాను మొదటి సినిమాకు అవార్డు తీసుకోగా.. తరుణ్ సైతం మొదటి సినిమా ‘నువ్వేకావాలి’ సినిమాకు అవార్డు తీసుకున్నారన్నారు.

    ఇక ఆయనపై గతంతో పలు రూమర్స్ వచ్చేవి. ఆయన ప్రేమలో పడ్డారని కొందరు వార్తలు రాశారు. కానీ అవన్నీ అవాస్తవమని వారికి కూడా తెలుసు. అవాస్తవ రాతల వల్ల ఎదుటివాళ్లు బాధపడుతారనే విషయం వారు గ్రహించరు. అందువల్ల మొదట్లో వీటి గురించి పట్టించుకొని బాధపడేవాళ్లం.. కానీ ఇప్పుడు పట్టించుకోవడం మానేశాం. తరుణ్ విషయంలో మాకు పెద్దగా కోరికలు ఏం లేదు. అయితే ఆయన పెళ్లయితే చాలు.. అని రోజా రమణి అన్నారు.

    ప్రస్తుతం తరుణ్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇదే సమయంలో వెబ్ సిరీస్ తో బిజీగా మారాడు. ఈరెండు త్వరలో విడుదల కానున్నాయి. అయితే ఏదీ ముందుగా రిలీజ్ అవుతుందో తెలియదు. ఒకప్పుడు తరుణ్ సినిమాలంటే కాలేజీ యూత్ బాగా లైక్ చేసేవారు. అయితే ప్రస్తుతం తరుణ్ ఎలా ఉన్నాడోనంటూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలో రోజారమణి తరుణ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.