Tollywood Actors: పేరు ప్రఖ్యాతలు అంటేనే కూరుకుపోయి కరిగిపోయేవి. కరిగిపోయి కాల గమనంలో గల్లంతు అయిపోయేవి.. వాటినే పేరు ప్రఖ్యాతలు అంటారు. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో గొప్ప నటులు అంటూ ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ, వారి జీవితాలు మాత్రం చివరి వరకూ కష్టమయంగానే సాగాయి.
అందుకే, వీళ్లంతా తెలుగు చలన చిత్ర చరిత్రలో అత్యంత దురదృష్టవంతులైన నటులుగా మిగిలిపోయారు. వాళ్ళు ఎవరో చూద్దాం.
చిత్తూరు నాగయ్య :
దక్షిణాది పరిశ్రమలోనే మొదటి సూపర్ స్టార్. ఆ రోజుల్లో నాగయ్య అంటే ఓ సంచలనం. ఓ వెలుగు వెలిగారు. తెలుగు ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా కూడా ఆయన అప్పట్లో రికార్డు సృష్టించారు. కానీ, ఆ గొప్ప స్థాయి నుంచి చివరకు కడుపు నింపుకోవడం కోసం జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాల్సిన దుస్థితి వచ్చింది నాగయ్య.
కస్తూరి శివరావు :
కస్తూరి శివరావు గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, తెలుగు సినీ లోకంలో మొట్టమొదటి స్టార్ హాస్యనటుడు అంటే కస్తూరి శివరావునే. ఆ రోజుల్లో ఆయన కూడా స్టార్ డమ్ రుచి చూశారు. పైగా చేతినిండా అవకాశాలు. అందుకే, ఆ రోజుల్లోనే ఖరీదైన కార్లలో తిరిగిన మొట్టమొదటి హాస్యనటుడిగా కూడా ఆయన రికార్డు క్రియేట్ చేశారు. కానీ, చివరి రోజుల్లో అవకాశాలు లేక, అనాధగా చనిపోవాల్సి వచ్చింది.
ఐరన్ లెగ్ శాస్త్రి :
పాపం ‘ఐరన్ లెగ్ శాస్త్రి’ అంటూ ఆయన జీవితాన్ని నాశనం చేశారు. నిజానికి ఆయన నటుడు కాదు. మొదట్లో సినిమా కార్యక్రమాలకు పూజలు చేసేవారు. పూజలు చేసే కాలంలో ఆయన చాలా బాగా బతికే వారు. కానీ, ఎప్పుడైతే అశుభానికి మారుపేరుగా ఐరన్ లెగ్ అంటూ ఐరన్ లెగ్ శాస్త్రి తెర మీదకు తీసుకువచ్చారో అప్పటి నుంచి ఆయన జీవితం మారిపోయింది. మొదట్లో అవకాశాలు ఉన్నంత కాలం ఆయన జీవితం బాగానే సాగింది. కానీ చరమాంకంలో మాత్రం ఆయన జీవితం ఎంతో దయనీయంగా మారింది.
Also Read: పవన్ కళ్యాణ్ రికార్డును తుడిచిపెట్టిన విజయ్ దేవరకొండ !
పొట్టి ప్రసాద్ :
పొట్టి ప్రసాద్ గొప్ప హాస్య నటుడు. ఉదయించకుండానే హస్త మించిన సూరీడు అనే వ్యాఖ్యానికి పొట్టి ప్రసాద్ జీవితం పర్ఫెక్ట్ గా సరిపోతుంది.
చంటబ్బాయ్, సాగర సంగమం లాంటి చిత్రాల్లో ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. నాటక రంగం నుంచి వచ్చిన ప్రతిభావంతుడైన నటుడు ఆయన. చివరి రోజుల్లో అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు.
అలాగే అందరికీ తెలిసిన కాంతారావు, పద్మనాభం, మరియు అంజిగాడిగా పేరు గాంచిన వల్లూరి బాలకృష్ణ అనే పాత తరం నటుడు, ఇక చిడతల అప్పారావు, అలాగే పొట్టి వీరయ్య ఇలా చాలామంది చివరి రోజుల్లో ఆకలి బాధలకు ఎంతగానో నలిగిపోయారు.
Also Read: ఆ రోజును రాజమౌళి ఎప్పటికీ మర్చిపోలేడట !