https://oktelugu.com/

Most Eligible Bachelor Movie Dialogues in Telugu

హిట్ కోసం  ‘పూజా హెగ్డే’ కి  రెండున్నర  కోట్ల భారీ రెమ్యునరేషన్ ను  ఇప్పించి  మరీ..  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’  సినిమా చేశాడు అక్కినేని  అఖిల్.  ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి  పూజా హెగ్డే ఇమేజ్ ను, Most Eligible Bachelor  క్రేజ్ ను వాడుకోవడానికి  ‘అఖిల్ టీమ్’  తెగ  కిందామీదా పడుతుంది.   ట్రైలర్ లో  కూడా  ‘పూజా హెగ్డే’  గ్లామర్ ను,  ఫీలింగ్స్ నే   ఎక్కువ  హైలైట్ చేశారు. ‘మన లైఫ్‌ పార్టనర్‌తో కనీసం […]

Written By:
  • Admin
  • , Updated On : October 5, 2021 / 10:40 AM IST
    Follow us on

    హిట్ కోసం  ‘పూజా హెగ్డే’ కి  రెండున్నర  కోట్ల భారీ రెమ్యునరేషన్ ను  ఇప్పించి  మరీ..  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’  సినిమా చేశాడు అక్కినేని  అఖిల్.  ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి  పూజా హెగ్డే ఇమేజ్ ను, Most Eligible Bachelor  క్రేజ్ ను వాడుకోవడానికి  ‘అఖిల్ టీమ్’  తెగ  కిందామీదా పడుతుంది.   ట్రైలర్ లో  కూడా  ‘పూజా హెగ్డే’  గ్లామర్ ను,  ఫీలింగ్స్ నే   ఎక్కువ  హైలైట్ చేశారు.

    ‘మన లైఫ్‌ పార్టనర్‌తో కనీసం 9000 సార్లు కలిసి పడుకోవాలి, వందల వెకేషన్స్‌కి వెళ్లాలి. అన్నింటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడు ఎవడు’ అంటూ  పూజా హెగ్డే  ఆత్రంగా అడుగుతూ ఉండగా..   ఓవర్  బిల్డప్ షాట్స్ లో  అఖిల్ బాబు ఎంట్రీ ఇస్తాడు.   ‘పూజా హెగ్డే’ నోటి నుంచి  ‘లైఫ్‌ పార్టనర్‌ తో కనీసం 9000 సార్లు  పడుకోవాలి’ అనే మాట వినిపించడంతో  సహజంగానే  ట్రైలర్  యూత్ కి  బాగా  కనెక్ట్ అయింది.

    Also Read: Akhanda Movie Dialogues 

    ఇక  వందల వెకేషన్స్‌,  లక్షల కబుర్లు అంటూ  సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది  ‘పూజా.  అదే సమయంలో   ‘ఓ అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరీర్‌, 50 శాతం పెళ్లి.  ఐతే,  మ్యారీడ్‌  లైఫ్‌ బాగుండాలంటే కెరీర్‌ బాగుండాలి’ అంటూ Most Eligible Bachelor Movie Dialogues Telugu పెళ్ళికి రెడీ  అవుతాడు  హీరో.   అలా   రెండు భిన్న అభిప్రాయాలు కలిగిన  ఈ ఇద్దరి మధ్య జరిగిన  రొమాంటిక్‌ అండ్  ఫ్యామిలీ ఎంటర్‌టైనరే  ఈ సినిమా.

    ఎలాగూ  మధ్యమధ్యలో  ‘పూజా హెగ్డే’  కాళ్ళను కళ్ళను హైలైట్  చేయడానికి దర్శకనిర్మాతలు  పరిధికి మించి  ప్రయత్నిస్తారు అనుకోండి.   ట్రైలర్ లో కూడా  ‘పూజా హెగ్డే’  కాళ్ళను రెండు  సార్లు క్లోజ్ షాట్స్ లో చూపించారు.  పైగా,  వాటిని చూసి హీరో ప్లాట్ అయిపోయినట్టు కూడా  ఓ ప్రత్యేక షాట్ పెట్టారు. అలాగే  బి. సి ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని   ‘పూజా హెగ్డే’ పై  ఓ స్పెషల్ ఎక్స్ పోజింగ్  సాంగ్ ను  కూడా  సినిమాలో ప్రత్యేకంగా డిజైన్ చేశారు.  ఈ సాంగ్  సెకండ్ హాఫ్ లో  రెండో సాంగ్ గా  రాబోతుంది.  ‘పూజా హెగ్డే’తో   అఖిల్ జాతకం  మారుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.

    అదే విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి   బలమైన ఫ్యామిలీ  ఎమోషన్స్ కూడా పెట్టారు. ట్రైలర్ లోనే    ‘నీకు పెళ్లి గురించి ఏం తెలియదు. అసలు నీకు గురించి నీకే తెలియదు’ అంటూ ‘పూజా హెగ్డే’,   అఖిల్ మీద సీరియస్ అవ్వడం,    ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్లికి రెడీ అయ్యాను’ అంటూ అఖిల్,   ‘పూజా హెగ్డే’కి కౌంటర్ ఇవ్వడం..  ఇలా  ఇద్దరి మధ్య బలమైన సంఘర్షణ కూడా సినిమాలో ఉండబోతుందని  ఈ రెండు డైలాగ్స్ లో ఎస్టాబ్లిష్ చేశారు.

    most eligible bachelor movie stills

    అన్నిటికీ మించి  ‘మందని వదలి.. కొత్తదారి వెతికి,  నేను వెళ్తున్నా, మీరూ రండి’ అంటూ అఖిల్ బ్యాక్ షాట్ ను ఫేడ్ అవుట్ లో చూపించి  మొత్తానికి  ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాడు   బొమ్మరిల్లు భాస్కర్.  మరి,  అక్టోబర్ 15 దసరా కానుకగా రాబోతున్న  ఈ సినిమా  హిట్ అవుతుందా ?  భారీ విజయం  కోసం విశ్వప్రయత్నాలు చేస్తోన్న అఖిల్ కల ఇప్పటికైనా  నెరవేరుతుందా ?

    నిజానికి  అక్కినేని  హీరోలకు  ప్రేమకథలు బాగా కలిసొస్తాయి. ఏఎన్నార్  కాలం నుండి  అక్కినేని  హీరోల ప్రేమకథలకు  ప్రత్యేక  క్రేజ్ ఉంది.  నాగార్జున కెరీర్ లో ఎన్ని  మాస్ సినిమాలు ఉన్నా,   ఎన్ని  కమర్షియల్ హిట్‌లు ఉన్నా..  నాగార్జునకి  ఎక్కువ పేరు తెచ్చి,   మన్మథుడిగా నిలబెట్టింది మాత్రం ప్రేమకథలే.   నాగచైతన్య  కెరీర్ లో కూడా   భారీ హిట్స్ గా నిలిచిన సినిమాలన్నీ  ప్రేమకథలే.  రీసెంట్ గా రిలీజ్ అయి హిట్ అయిన  ‘లవ్‌ స్టోరీ’తో సహా.

    మరీ  అక్కినేని  ఫ్యామిలీ ట్రాక్ రికార్డును  చూస్తే..   అఖిల్ కి  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’ తో  హిట్ వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.  పైగా ఈ సినిమా విషయంలో  బ‌న్నీవాసు, వాసువ‌ర్మ  స్పెషల్ కేర్  తీసుకున్నారు.  ఓవర్ బడ్జెట్ అవుతుందని  తెలిసినా..  రీషూట్ లు చేసి మరీ.. ఈ సినిమా అవుట్ ఫుట్  బాగా రావడానికి  శ్రద్ధ పెట్టారు.  కాబట్టి..  ఈ సినిమా అఖిల్ కెరీర్ కి  టర్నింగ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది.

    Most Eligible Bachelor Movie Dialogues in Telugu

    Most Eligible Bachelor Movie Dialogues

     

    Most Eligible Bachelor Movie Dialogues

     

    Most Eligible Bachelor Movie Dialogues

     

    Most Eligible Bachelor Movie Dialogues

     

    Most Eligible Bachelor Movie Dialogues

     

    Most Eligible Bachelor Movie Dialogues

     

    Most Eligible Bachelor Movie Dialogues

     

    Most Eligible Bachelor Movie Dialogues

     

    Most Eligible Bachelor Movie Dialogues

     

    Most Eligible Bachelor Movie Dialogues

    Most Eligible Bachelor Movie Dialogues Lyrics

    #1)
    మన లైఫ్ పాట్నర్ తో కలిసి 9000 నైట్స్ కలిసి పడుకోవాలి..
    వందల వాకేషన్స్ కి వెళ్ళాలి అన్నటికి మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి.

    #2)
    What do you expect from married life?
    అదే మీ మ్యారీడ్ లైఫ్ నుంచి మీరు ఏమి ఎక్సపెక్ట్ చేస్తున్నారు? కేరింగ్ హస్బెండ్. & అన్ని పనులు చేసేసుకోవాలి..

    #3)
    Love.. love.. love ఇంకేం ఉంటుంది అండి మ్యారీడ్ లైఫ్ లో ?
    కొంచెం వైల్డ్ గా థింక్ చెయ్..హా !

    #4)
    నాకు కాబోయేవాడు నా షూస్ తో సమానం..

    #5)

    Do u like Sunrise or sunset? నాకు మాత్రం సన్ సెట్ ఏ ఇష్టం.!
    ఎందుకు ? ఎందుకు అంటే దీని తరువాతే గా రాత్రి వస్తుంది !

    #6)
    what do you expect from married life?
    ఆ ఇడ్లి వడ సాంబార్…

    #7)
    ఒక అబ్బాయి లైఫ్ లో ఫిఫ్టీ పర్సెంట్ క్యారీర్ ఫిఫ్టీ పర్సెంట్ మారీడ్ లైఫ్
    మారీడ్ లైఫ్ బాగుండాలి అంటే కెరీర్ బాగుండాలి.

    #8)
    లైఫ్ పాట్నర్ లో ఏమి కావాలో నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందకు?
    ఓహో ఫుల్లు క్లారిటీ తో ఉన్నారన్నమాట !

    #9)
    నేను కొత్త ఐ ఫోన్ కొనుకున్నాక పాత ఫోన్ దానికి ఇచ్చేసాను !
    రేపు పాత బడ్డానని నన్ని కూడా పని మనిషికి ఇచ్చేస్తారా ?

    #10)
    పెళ్లి చూపుల్లో నిన్ను ఆ అబ్బాయి కలిసాడు కూడా ఏమి అడిగాడు నిన్ను?
    వైల్డ్ గా థింక్ చెయ్ డార్లింగ్ అని అన్నాడు సర్..!

    #11)
    నీకు పెళ్లి గురించి ఎం తెలీదు.. చేసుకోబోయే అమ్మయి లో ఎం కావాలో తెలీదు.. నీ గురించి కూడా నీకు ఏమి తెలియదు !