https://oktelugu.com/

‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ఫస్ట్ సాంగ్…

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బ‌న్నివాసు, వాసువ‌ర్మ తో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యొక్క మొద‌టి పాట‌ను విడుద‌ల చేశారు. “మ‌న‌సా…. మ‌నసా… మ‌న‌సారా… బ్ర‌తిమాలా… త‌న‌వ‌క‌వడిలో ప‌డ‌బొకే మ‌న‌సా అంటూ సాగే ఈ సాంగ్ ప్ర‌స్తుతం సెన్సేష‌న్ గా ట్రెండ్ అవ్వడం విశేషం. జీఏ 2 బ్యాన‌ర్ నుంచి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 2, 2020 / 12:12 PM IST
    Follow us on

    అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బ‌న్నివాసు, వాసువ‌ర్మ తో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యొక్క మొద‌టి పాట‌ను విడుద‌ల చేశారు. “మ‌న‌సా…. మ‌నసా… మ‌న‌సారా… బ్ర‌తిమాలా… త‌న‌వ‌క‌వడిలో ప‌డ‌బొకే మ‌న‌సా అంటూ సాగే ఈ సాంగ్ ప్ర‌స్తుతం సెన్సేష‌న్ గా ట్రెండ్ అవ్వడం విశేషం.

    జీఏ 2 బ్యాన‌ర్ నుంచి గ‌తంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ గీత‌గోవిందం ఆడియో ఒక సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. మ్యూజిక‌ల్ హిట్స్ కొంత గ్యాప్ వ‌చ్చిన స‌మ‌యంలో ఈ చిత్రం మ్యాజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌టం విశేషం. మళ్ళి అదే కాంబినేష‌న్ లో వస్తున్న ఈసినిమా ఆడియో కూడా అదే రేంజి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం అంద‌రిలో వుంది. గోపీసుంద‌ర్ కంపోజ్ చేసిన ఈ ఆల్బ‌మ్ లో సిడ్ శ్రీరామ్ పాడిన‌ ఈ పాట మ‌నసు దోచుకుంది. ఈపాట‌ని ఎన్నో మంచి పాట‌ల‌కి సాహిత్యాన్ని అందించిన సురేంద‌ర్ కృష్ణ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించారు.