సినిమా అంటేనే రిస్క్. ఆ సినిమాను ఆర్థికంగా రిస్క్ చేసి తీయడం మరింత రిస్క్. ఇప్పుడు మంచు విష్ణు ఇదే చేశాడు. కథపై నమ్మకంతో తన మార్కెట్ ను మించి భారీగా ఖర్చు చేసిన సినిమా ‘మోసగాళ్లు’. ఈ శుక్రవారం(మార్చి 19) రిలీజైన సినిమా తొలి రోజుతోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో.. సినిమా చూసేందుకు ప్రేక్షకులు ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని కండీషన్లో ఉన్నాడట విష్ణు!
Also Read: ఆటనాది.. కోటి మీది అంటున్న యంగ్ స్టార్…
ఈ చిత్రాన్ని 50 కోట్లు ఖర్చు చేసి తీశామని చెబుతూ వచ్చాడు విష్ణు. అయితే.. ఇందులో సగమైనా ఖర్చు చేసి ఉంటారనే అభిప్రాయం ఉంది. అంతేకాదు.. ఇందులోనూ రూ.15 కోట్లు ఫైనాన్స్ నుంచి పట్టుకొచ్చినవేనని సమాచారం. అయితే.. చాలా సినిమాలకు ఇలాగే ఫైనాన్స్ లో తెస్తారు. కానీ.. సినిమా రిలీజ్ నాటికే ఫైనాన్స్ క్లియర్ అయిపోతూ ఉంటుంది. సినిమాను అమ్మగా వచ్చిన డబ్బులతో సెటిల్ చేస్తారు.
Also Read: ‘వకీల్ సాబ్’ హిస్టరీ రిపీట్ చేస్తాడా..?
కానీ.. మోసగాళ్లు సినిమాను ఎవ్వరూ కొనలేదు. దీంతో.. అనివార్యంగా విష్ణు సొంతంగా రిలీజ్ చేయాల్సి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో మోహన్ బాబు ముందుకు వచ్చి సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేశాడని టాక్. ఫైనాన్షియర్లకు ఆయనే ష్యూరిటీగా ఉన్నాడట. సినిమా మంచిగా ఆడితే వచ్చే డబ్బులతో కట్టేద్దామని అనుకున్నారట. కానీ.. సినిమా పెద్దగా ఆడే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో.. మోహన్ బాబే చెల్లించాల్సి వచ్చేట్టుగా ఉందట పరిస్థితి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
అయితే.. ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్, ఓటీటీ రైట్స్ బిజినెస్ జరగాల్సి ఉంది. వాటి ద్వారానైనా కొంత రాబట్టి.. అప్పులు సెటిల్ చేద్దామని చూస్తున్నాడట విష్ణు. అన్ని భాషల్లోనూ ఈ సినిమాను డబ్ చేయడంతో.. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. మరి, అవి ఎంత వస్తాయి? అప్పులు ఎంత బ్యాలెన్స్ ఉంటాయి? అన్నది తేలాల్సి ఉంది. అవిపోగా మిగిలిన వాటికి మోహన్ బాబు చెక్కు రాయాల్సిందేనని అంటున్నారు.