Monkey Man : స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు దేవ్ పటేల్. ఏకంగా 8 ఆస్కార్ అవార్డ్స్ ఈ సినిమా గెలిచింది. ఏ ఆర్ రెహమాన్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్స్ గెలిచారు. దేవ్ పటేల్ తాజాగా మంకీ మాన్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ హాలీవుడ్ మూవీ ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఏప్రిల్ 26న ఇండియాలో విడుదల కానుందని ప్రచారం జరిగింది. సడన్ గా మంకీ మాన్ ఓటీటీలోకి వచ్చినట్లు సమాచారం అందుతుంది.
ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీలో మంకీ మాన్ స్ట్రీమ్ అవుతుంది. దేవ్ పటేల్ ఈ చిత్ర దర్శకుడితో పాటు హీరో కూడాను. రివేంజ్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. హనుమంతుడు స్ఫూర్తితో మంకీ మాన్ తెరకెక్కింది. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్. అలాగే బలమైన కథ ఉంది. మరొక విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల కీలక రోల్ చేసింది. ఆమె వేశ్య పాత్ర చేసింది.
ఓ ఇంటర్వ్యూలో ఆమె మంకీ మాన్ లో పాత్రపై స్పందించడం విశేషం. సీత అనే వేశ్య పాత్రలను హాలీవుడ్ ఆడియన్స్ ఆదరించారు. ఇండియన్ ఆడియన్స్ సైతం ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. శోభిత దూళిపాళ్ల బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా సత్తా చాటుతుంది. శోభిత హీరో నాగ చైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ ఆ ఉన్నారు. వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే ప్రచారం జరుగుతుంది.
ఇక మంకీ మాన్ చిత్ర కథ విషయానికి వస్తే… హీరో దేవ్ పటేల్ రాత్రిపూట ఫైటింగ్ క్లబ్స్ లో పోటీ పడుతూ ఉంటాడు. ఇతడు ముఖాన్ని చూపించడు. ఒక పేరు అంటూ ఉండదు. కోతి మాస్క్ ధరించి ఫైట్ చేస్తాడు. ఇతడు ఓ క్లబ్ లో వేశ్యగా పని చేస్తున్న అమ్మాయిని కాపాడాలి అనుకుంటాడు. దాని కోసం క్రూరుడైన ఓ పోలీస్ అధికారితో పోటీ పడతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ తో హీరోకి బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. మరి మంకీ మాన్ ఇండియన్ ఆడియన్స్ ని ఈ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.