Pushpa 2: The Rule : విడుదలకు నాలుగు నెలల సమయం ఉంది. పుష్ప 2 మేకర్స్ వరుస అప్డేట్స్ తో సినిమా పై హైప్ మరింతగా పెంచేస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా టీజర్ విడుదల చేశారు. ఇండియా వైడ్ పుష్ప 2 టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కాళికా దేవి గెటప్ లో అల్లు అర్జున్ రౌడీలను ఇరగదీశాడు. అంతకు మించి ఆయన మాస్ మేనరిజమ్స్ గూస్ బంప్స్ లేపాయి. టీజర్ మేనియా నుండి బయటకు రాకుండానే… మరో సర్ప్రైజింగ్ అప్డేట్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశాడు అల్లు అర్జున్.
పుష్ప 2 నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. పుష్ప 2 ఫస్ట్ సాంగ్ ”పుష్ప పుష్ప’ ఏప్రిల్ 24 సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదల చేస్తున్నారు. దీంతో పుష్ప ది రైజ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్ ఎక్స్ ని షేక్ చేస్తుంది. 2021లో విడుదలైన పుష్ప సాంగ్స్ విశేష ఆదరణ పొందాయి. మూవీ సక్సెస్ లో దేవీశ్రీ సాంగ్స్ కీలకం అయ్యాయి. పుష్ప 2కి సైతం దేవిశ్రీ సాంగ్స్ అందిస్తున్నారు.
రేపు విడుదలయ్యే ఊరమాస్ సాంగ్ కి దేవిశ్రీ ఎలాంటి ట్యూన్ ఇచ్చాడనే ఆసక్తి నెలకొంది. ఇక సౌత్ కి మించి నార్త్ ఇండియాలో పుష్ప 2 కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 హిందీ రైట్స్ రూ. 200 కోట్లకు అమ్ముడుపోయాయి. కల్కి, దేవర చిత్రాల హక్కుల కంటే ఇది చాలా ఎక్కువ. అంతగా నార్త్ ఆడియన్స్ పుష్ప 2పై ఆసక్తి పెంచుకున్నారు.
కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 1000 కోట్లకు చేరుకుందని అంటున్నారు. పుష్ప 2 రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇండిపెండెన్స్ డే కానుకగా పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నాడు. సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక రోల్స్ లో అలరించనున్నారు.
THE WORLD WILL SING THE PRAISE OF PUSHPA RAJ ❤️🔥❤️🔥#Pushpa2TheRule First Single #PushpaPushpa Lyrical Promo out tomorrow at 4:05 PM ❤️🔥
Rockstar @ThisIsDSP Musical 🎵🔥#Pushpa2FirstSingle ❤️🔥
Grand release worldwide on 15th AUG 2024 💥💥
Icon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/F6CqyMNUZT
— Pushpa (@PushpaMovie) April 23, 2024