Mokshagna Teja: నందమూరి నటసింహం బాలయ్య బాబు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఆయన వందకు పైన సినిమాలను చేసి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక తన కొడుకు మోక్షజ్ఞ కి సైతం 30 సంవత్సరాలు వస్తున్నప్పటికి ఆయన ఇప్పటివరకు ఇంకా ఒక్క సినిమా కూడా చేయకపోవడం ప్రతి ఒక్క నందమూరి అభిమానిని తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తోంది. నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం వారసుడు అంటూ బాలయ్య బాబు ఎప్పటికప్పుడు ప్రమోట్ చేసుకుంటూ వచ్చినప్పటికి మోక్షజ్ఞ మాత్రం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి చాలా వరకు భయపడిపోతున్నట్టుగా తెలుస్తోంది. కారణం ఏదైనా కూడా అతను ఎవరితో సినిమాలు చేస్తాడని చెప్పిన ఫైనల్ గా ఆ దర్శకుడు హ్యాండ్ ఇస్తూ వస్తున్నారు. ఇక ఇప్పటికైనా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది… కొంతమంది మాత్రం మోక్షజ్ఞ సినిమా కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయి బాలయ్య బాబు రిటైర్మెంట్ ప్రకటించేలోపైన మోక్షజ్ఞ సినిమా చేస్తాడా లేదా అంటూ సోషల్ మీడియాలో వల్ల కామెంట్లను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లాంటి నటుడు ఎలాంటి క్యారెక్టర్ అయిన సరే చేసి మెప్పించగలను అనేంత కాన్ఫిడెంట్ తో ఉంటాడు. కానీ మోక్షజ్ఞ దగ్గర మాత్రం అది కనిపించడం లేదు. అందువల్లే బాలయ్య కొంతవరకు తడబడుతున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఎట్టకేలకు ఇండస్ట్రీకి పరిచయమైన కూడా అతను తన స్టామినాను చాటుతాడా? లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాకపోతే మాత్రం భారీ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలామంది నట వారసులు ఇండస్ట్రీలో సక్సెస్ కాలేక ఫేడౌట్ అయిపోయారు. ఇక ప్రేక్షకులు సైతం వాళ్ళను విమర్శిస్తూ ఉండడం విశేషం…
మోక్షజ్ఞ పరిస్థితి కూడా అలానే అవుతుందా? లేదంటే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశ్యం తనకు లేదా అనే విషయం క్లారిటీగా తెలియాల్సి ఉంది…ఇక బాలయ్య సైతం మోక్షజ్ఞ ను ఫోర్స్ చేయకుండా ఫ్రీ గా వదిలేస్తే మంచిది. తనకు నచ్చింది చేస్తాడు. లేకపోతే మాత్రం తమ కెరియర్ అటు ఇటు కాకుండా పోతోంది…