Mohan Babu: వారం రోజులుగా మంచు ఫ్యామిలీలో సంక్షోభం నెలకొంది. చిన్న కుమారుడు మనోజ్… తండ్రికి వ్యతిరేకంగా గళం విప్పాడు. మోహన్ బాబు, విష్ణు నడుపుతున్న శ్రీ విద్యా నికేతన్ విద్యాసంస్థల్లో అవినీతి, అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో దాడులు, ప్రతి దాడులు చోటు చేసుకున్నాయి. శత్రువుల మాదిరి కుమ్ములాడుకున్నారు. ప్రైవేట్ సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మోహన్ బాబు ఫార్మ్ హౌస్ వద్ద పెద్ద హైడ్రామా నడిచింది.
మనోజ్ ని నివాసంలోకి రాకుండా మెయిన్ గేట్ వద్ద మోహన్ బాబు మనుషులు అడ్డుకున్నారు. మనోజ్ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు. అక్కడే ఉన్న మీడియా ఆయనతో పాటు లోపలికి వెళ్లారు. టీవీ 9 ప్రతినిధి మోహన్ బాబును ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. ఆగ్రహానికి గురైన మోహన్ బాబు చేతిలోని మైక్ లాక్కుని తలపై కొట్టాడు. టీవీ 9 రిపోర్టర్ తలకు తీవ్ర గాయమైంది. పై దవడ పక్కన ఉన్న ఎముక మూడు చోట్ల విరిగింది. అతడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది.
మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ఫస్ట్ నమోదు చేసిన సెక్షన్ మార్చి 307.. పెట్టారు. అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు మోహన్ బాబుపై నమోదైంది. ఈ కేసులో మోహన్ బాబు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంతో మోహన్ బాబు హై కోర్టులో ముందస్తు బెయిల్ కి పిటిషన్ వేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ తో మోహన్ బాబు కూడా ఆందోళన గురయ్యారని తెలుస్తుంది. అందుకే ఆయన జాగ్రత్తపడుతున్నారనే వాదన వినిపిస్తోంది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్ తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. నేడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు, నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తున్నారు.