https://oktelugu.com/

Mohan Babu: ‘సున్నా’ మార్కెట్ నుండి 100 కోట్ల రూపాయిల రేంజ్ కి వెళ్లిన మోహన్ బాబు.. యంగ్ హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డు

హిట్స్ , బ్లాక్ బస్టర్స్ తో పాటుగా ఆయనకీ హీరో గా ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. అలాంటి మోహన్ బాబు కి 2000 దశకం ప్రారంభం అయిన తర్వాత మార్కెట్ మొత్తం పోయింది.

Written By:
  • Vicky
  • , Updated On : June 2, 2023 / 08:54 AM IST

    Mohan Babu

    Follow us on

    Mohan Babu: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉండొచ్చు, కానీ లెజెండ్ అనిపించుకునే స్థాయి మాత్రం కొందరి హీరోలకు మాత్రమే ఉంది. ఆ కొందరి లో ఒక్కడే మంచు మోహన్ బాబు.విలన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించిన మోహన్ బాబు, ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా, హీరో గా కూడా సక్సెస్ అయ్యాడు. జనాల్లో విలన్ గా ముద్రపడిపోయిన తర్వాత హీరో గా స్టార్ రేంజ్ కి ఎదగడం అనేది సాధారణమైన విషయం కాదు, మోహన్ బాబు హీరో గా కూడా స్టార్ అయ్యి చూపించాడు.

    హిట్స్ , బ్లాక్ బస్టర్స్ తో పాటుగా ఆయనకీ హీరో గా ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. అలాంటి మోహన్ బాబు కి 2000 దశకం ప్రారంభం అయిన తర్వాత మార్కెట్ మొత్తం పోయింది. కనీసం ఒక మీడియం రేంజ్ హీరో కి ఉండాల్సినంత మార్కెట్ కూడా మోహన్ బాబు కి లేకుండా పోయింది. ఆ తర్వాత ఆయన పెద్ద కొడుకు మంచు విష్ణు ఇండస్ట్రీ లోకి వచ్చి అడపాదడపా హిట్స్ కొట్టినా స్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. రెండవ కొడుకు మంచు మనోజ్ పరిస్థితి కూడా ఇంతే.

    ఇలా తన కుటుంబం నుండి ఇద్దరు కొడుకులు వచ్చినప్పటికీ కూడా లేజసి ని నిలబెట్టలేకపొయ్యారు. దీనితో మోహన్ బాబు కుటుంబానికి ఇండస్ట్రీ లో మార్కెట్ జీరో అయ్యింది.వీళ్లు హీరోలుగా నటించిన లేటెస్ట్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధించాయో మనం చూసాము. అంత తక్కువ మార్కెట్ ఉన్నా కూడా మోహన్ బాబు ని హీరో గా పెట్టి వంద కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో మంచు విష్ణు నిర్మాతగా ఒక సినిమా చేయబోతున్నారట. ఈ చిత్రం మోహన్ బాబు స్థాపించిన ‘విద్యానికేతన్’ విద్యాసంస్థల మీద ఉంటుందట.

    20 నుండి 30 కోట్ల రూపాయిల మార్కెట్ ఉన్న హీరోలు కూడా వంద కోట్ల రూపాయిల బడ్జెట్ తో సినిమాలు చెయ్యడం లేదు. అలాంటిది మోహన్ బాబు ‘సున్నా’ మార్కెట్ ని పెట్టుకొని కూడా వంద కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టి సినిమా చెయ్యాలనుకుతున్నారంటే, మంచు హీరోలకు పిచ్చో , పైత్యమో అర్థం కావడం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.