https://oktelugu.com/

Mohan Babu: నేను వస్తే ఏకంగా నాగేశ్వరరావు, దాసరి లేచి నిలబడ్డారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మోహన్ బాబు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి మోహన్ బాబు గురించి ఇలాంటి విషయమే ఒకటి బయటపడింది. బుధవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల్లో మోహన్ బాబు పాల్గొన్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 21, 2023 / 04:35 PM IST

    Mohan Babu

    Follow us on

    Mohan Babu: ఏ పాత్రనైనా పోషించగలిగే అతి కొద్ది మంది తెలుగు గొప్ప నటులలో మోహన్ బాబు ఒకరు. కానీ తాను చెప్పిందే కరెక్ట్.. తన తర్వాతే ఎవరైనా అని కొన్నిసార్లు మోహన్ బాబు తెలిసో తెలియకో చేసే వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. కాగా ఎంతోమంది సెలబ్రెటీస్ తో కూడా మోహన్ బాబు కొంచెం దురుసుగా అలానే కొంచెం వెతకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు అని మోహన్ బాబుకి పేరు ఉంది .

    ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి మోహన్ బాబు గురించి ఇలాంటి విషయమే ఒకటి బయటపడింది. బుధవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల్లో మోహన్ బాబు పాల్గొన్నారు. స్టూడియోలో ఏర్పాటుచేసిన ఏఎన్నార్ నిలువెత్తు కాంస్య విగ్రహానికి నివాళులు అర్పించిన తరవాత కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

    ‘అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడాలి అంటే నేను ఒక పెద్ద పుస్తకాన్ని రాయొచ్చు. మా ఇద్దరికి ఉన్నటువంటి బంధం, అనుబంధం అలాంటిది. నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు నాగేశ్వరరావు గారి సినిమా 100 రోజుల ఫంక్షన్ జరుగుతుంది అంటే అక్కడికి వెళ్లి ఆయన్ని చూద్దామని ప్రయత్నించి చొక్కా చించుకుని రూముకి వెళ్లినవాడిని. మళ్లీ ఆ చొక్కా కుట్టించుకోవడానికి కూడా డబ్బుల్లేవు. అటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారితో సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం నాకు దక్కింది. నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు పనిచేసిన మరపురాని మనిషి సినిమాకు నేను అసోసియేట్‌గా పనిచేశాను’ అని మోహన్ బాబు గుర్తుచేసుకున్నారు.

    ఆ తర్వాత మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోలోనే సినిమా చేస్తున్నప్పుడు తన కంటే ముందుగానే నాగేశ్వరరావు సెట్‌కు వెళ్లి కూర్చున్నారని.. అప్పుడు తాను చెప్పిన మాటలకు తరవాత ఆయన సెటైర్ వేశారని మోహన్ బాబు గుర్తుచేసుకున్నారు. ‘నా కన్నా ముందే వెళ్లి ఫ్లోర్ ముందు నాగేశ్వరరావు గారు కూర్చున్నారు. నేను లేటుగా వెళ్లాను.. నమస్కారం సర్ అన్నాను. ఏంటయ్యా అలా ఉన్నావు అన్నారు. నాకొక కోరిక ఉంది సర్ అన్నాను. దాసరి నారాయణరావు లోపల ఉన్నారు, మీరేమో బయట ఉన్నారు. ప్రతిసారీ మీరొస్తే నేను లేచి నిలబడాలా? నేనొస్తే మీరు లేచి నిలబడాలని కోరిక కోరుకుంటున్నాను సర్ అన్నాను. అమ్మ లమ్మిడీ కొడకా నీకు అంత కోరిక ఉందా అన్నారు. మరుసటి రోజు ఇదే ఫస్ట్ ఫ్లోర్‌లో నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు గారు బయట ఉన్నారు. నేను మేకప్ వేసుకుని వెళ్లాను. ఇద్దరూ లేచి నిలబడ్డారు. ఇదేంటి సర్ ఇద్దరూ లేచి నిలబడ్డారు అని అడిగాను. లేదులే.. నీ కోరిక కదా, అందుకే మేమిద్దరం లేచి నిలబడ్డాం అన్నారు. అలాంటి చమత్కారాలు నాగేశ్వరరావు గారిదో ఎన్నో ఉన్నాయి’ అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

    ఇక మోహన్ బాబు చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.