Mohan Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు నైతే సంపాదించుకుంటున్నారు. ఇక కలెక్షన్ కింగ్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న మోహన్ బాబు సైతం చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషము… ప్రస్తుతం ఆయన సినిమాలేమీ చేయకుండా ఖాళీగా ఉంటున్నప్పటికి తన కొడుకుల సినిమాల్లో మాత్రం అడపాదడపా కనిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతుండటం విశేషం…ఒకప్పుడు విలన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత కామెడీ విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల బాధ్యతలను కొనసాగిస్తూ సినిమా ఇండస్ట్రీతో తనకున్న అనుబంధాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక తన ఎంటైర్ లైఫ్ లో 500 లకు పైన సినిమాలను చేయడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని కూడా సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి తన కొడుకులతో ఆయనకు విభేదాలు అయితే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా మనోజ్ తో ఆయనకు గొడవ జరగడం మోహన్ బాబు మీద కేసు కూడా ఫైల్ అవ్వడంతో ఈ గొడవ చాలా పెద్ద చర్చలకు దారి తీసిందనే చెప్పాలి.
ఇక ఈ గొడవలో భాగంగానే కొంతమంది రిపోర్టర్లు ఆయన ఇంటికి వచ్చి ఆయన అభిప్రాయాలను తెలుసుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు మోహన్ బాబు మాత్రం ఫ్రస్ట్రేషన్ లో ఉండి టీవీ9 రిపోర్టర్ అయిన రంజిత్ మీద దాడి చేశాడు. దాంతో అతనికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇక ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇక మోహన్ బాబు సైతం రంజిత్ ని కలవడానికి హాస్పిటల్ కి వెళ్లి అతన్ని పరామర్శించి అతని ట్రీట్మెంట్ కి అయ్యే మొత్తం ఖర్చులను తనే భరిస్తానని చెప్పాడు.
ఇక దాంతో పాటుగా ఆయనకు మోరల్ గా సపోర్ట్ ఇవ్వడానికి వెళ్లి తనకి క్షమాపణలు కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది…ఇక ఈ వీడియోకి అనుసంధానంగా శివాజీ సినిమాలో రజినీకాంత్ కొంతమందిని కొట్టి వాళ్లకు తనే ట్రీట్మెంట్ చేయించి వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు ‘నా అనుకున్న వాళ్లు ఎవరు మమ్మల్ని చూడటానికి రాలేదు. మీరు మాత్రం మాకోసం వచ్చారు’.
అంటూ వాళ్ళు చెప్పిన డైలాగుని హైలెట్ చేస్తూ కొంత మంది సోషల్ మీడియాలో ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే ఈ వీడియో చూసిన చాలా మంది చేతులు కలినాకా ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏం ఉంది మోహన్ బాబు అంటూ అతన్ని టోల్ చేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబు మాత్రం చేసింది తప్పే అని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం ఆయన ప్రమేయం లేకుండా తన ఇంట్లోకి వెళ్లడం రిపోర్టర్లు చేసిన తప్పుగా భావిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రిపోర్టర్ రంజిత్ తొందరగా కోలుకొని హాస్పటల్ నుంచి ఇంటికి తిరిగి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…
pic.twitter.com/J5eyuEHnlu https://t.co/fly6j5GS8p
— VikramShelby (@MrVicky184) December 15, 2024