Big shock to Mohan Babu: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఇండస్ట్రీ లో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత తానూ సంపాదించుకున్న డబ్బు తో విద్యానికేతన్ స్కూల్ ని స్థాపించాడు. ఈ స్కూల్ కాలక్రమేణా టాప్ మోస్ట్ స్కూల్ గా మారడంతో, దానిని కాస్త వ్యాప్తి చేస్తూ ఇంటర్మీడియట్, బీటెక్ కాలేజీలను ఏర్పాటు చేసాడు. ఈ విద్యాసంస్థల నుండి బయటకు వచ్చి ఎంతో మంది గొప్ప స్థాయికి వెళ్లారు. ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ విద్యానికేతన్ కి గొప్ప పేరు తీసుకొచ్చారు. రీసెంట్ గానే ఈ సంస్థలు యూనివర్సిటీ గా మారింది. అయితే ఈ యూనివర్సిటీ కి గుర్తింపు రద్దు చేయాలనీ ఉన్నత విద్య కమీషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కారణం నిబంధనలకు విరుద్ధం గా ఫీజులు వసూలు చేయడమే.
ఆంధ్ర ప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ సంస్థ రీసెంట్ గానే ఏపీ ఉన్నత విద్య కమీషన్ ని కలిసి ఈ కంప్లైంట్ ఇచ్చింది. దీనిని పరిశీలించిన తర్వాత ఈ యూనివర్సిటీ ని తక్షణమే మోహన్ యూనివర్సిటీ ని మూసివేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉత్తర్వలు జారీ చేసింది. ఉన్నత కమీషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే గడిచిన ఈ మూడేళ్ళలో విద్యార్థుల నుండి 26 కోట్ల 17 లక్షల రూపాయిలను ఫీజుల రూపం లో మోహన్ బాబు యూనివర్సిటీ వసూలు చేసిందని, ఈ ఏడాది జనవరి లో ఆ యూనివర్సిటీ పై 15 లక్షలు జరిమానా కూడా విధించినట్టు చెప్పుకొచ్చారు. కానీ జనవరి నెలలో జారీ చేసిన ఆ జరిమానా ఉత్తర్వులను యాజమాన్యం అసలు పట్టుకొచ్చుకోకపోవడం తో, విద్యార్థుల నుండి రాబట్టిన 26 కోట్ల రూపాయిలను, అదే విధంగా 15 లక్షల రూపాయల జరిమానా ని 15 రోజుల్లోపు కట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.
అంతే కాదు మోహన్ బాబు యూనివర్సిటీ కి గుర్తింపు ని రద్దు చేసి, పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కి తాత్కాలిక బాధ్యతలు అప్పించాలని ప్రభుత్వానికి విద్య కమీషన్ సూచనలు చేశారు. అయితే దీనిపై MBU యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఉత్తర్వులను బహిర్గతం చేసిందని, పబ్లిక్ లో అప్లోడ్ చేసిందని, మా పరువుకు భంగం కలుగుతోందని హై కోర్టు ని ఆశ్రయించారు. గతం లో కూడా అనేక సందర్భాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజులను దారుణంగా దండుకుంటుందని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. మంచు విష్ణు అయితే దీనిపై పెద్ద పోరాటమే చేసాడు. దీనిని మనమంతా గత కొంత కాలంగా గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.