https://oktelugu.com/

MohanBabu : టాలీవుడ్ లో ముసలం: ఇండస్ట్రీ పెద్దను కాదన్న చిరంజీవికి మోహన్ బాబు స్ట్రాంగ్ కౌంటర్

MohanBabu : టాలీవుడ్ లో మళ్లీ ముసలం మొదలైంది. ఆదిపత్యం కోసం టాలీవుడ్ అగ్ర కుటుంబాల మధ్య మళ్లీ మాటల మంటలు చెలరేగాయి. ఇండస్ట్రీకి నిజంగానే పెద్దగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈరోజు సినీ కార్మికుల సహాయం చేస్తున్న సందర్భంగా చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు. ‘తాను ఇండస్ట్రీకి పెద్ద కాదని.. ఇద్దరు కొట్టుకుంటుంటే పరిష్కరించలేనన్నారు. తాను తన వంతు సాయం ఎప్పుడూ సినీ కార్మికులకు చేస్తానని’ వివరించాడు. దీనికి తాజాగా మరో టాలీవుడ్ అగ్రహీరో మోహన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 2, 2022 / 08:18 PM IST
    Follow us on

    MohanBabu : టాలీవుడ్ లో మళ్లీ ముసలం మొదలైంది. ఆదిపత్యం కోసం టాలీవుడ్ అగ్ర కుటుంబాల మధ్య మళ్లీ మాటల మంటలు చెలరేగాయి. ఇండస్ట్రీకి నిజంగానే పెద్దగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈరోజు సినీ కార్మికుల సహాయం చేస్తున్న సందర్భంగా చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు. ‘తాను ఇండస్ట్రీకి పెద్ద కాదని.. ఇద్దరు కొట్టుకుంటుంటే పరిష్కరించలేనన్నారు. తాను తన వంతు సాయం ఎప్పుడూ సినీ కార్మికులకు చేస్తానని’ వివరించాడు.

    దీనికి తాజాగా మరో టాలీవుడ్ అగ్రహీరో మోహన్ బాబు కౌంటర్ ఇచ్చాడు. ‘సినిమా పరిశ్రమ అంటే నలుగురు హీరోలు కాదని.. నలుగురు ప్రొడ్యూసర్లు కాదని ’ మోహన్ బాబు హితవు పలికారు. ఈ మేరకు ఒక సుధీర్ఘ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. చిత్రపరిశ్రమలోని వారందరూ ఒక్కటిగా తెలుగు రాష్ట్రాల సీఎంలను కలవాలని పిలుపునిచ్చారు.

    సినిమా ఇండస్ట్రీలోని సమస్యల పై టాలీవుడ్ అంతా కలిసి ఒక చోట సమావేశమవ్వాలి.. సమస్యలు ఏంటి? పరిష్కారాలు ఏంటి ? సినీ పరిశ్రమ మనుగడకు ఏం చేయాలన్నది చర్చించుకోవాలి. ఆ తర్వాత సీఎంలు, మంత్రులను కలవాలని మోహన్ బాబు సూచించారు. సినీ పరిశ్రమలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.. అందరూ సమానమేనని.. అందరినీ కలుపుకు పోతే ఈ సమస్యలు మనకు వచ్చేవి కావని మోహన్ హితవు పలికారు.

    మెగా స్టార్ చిరంజీవి పొద్దున్న వ్యాఖ్యలకు కౌంటర్ గానే మోహన్ బాబు ఈ లేఖ రాశారని తెలుస్తోంది. ఇండస్ట్రీలోని నాలుగు కుటుంబాల గుత్తాధిపత్యాన్ని మోహన్ బాబు ప్రశ్నించారని అంటున్నారు. రండి అందరం కలిసి సినీ పరిశ్రమను బతికిద్దాం అంటూ పిలుపునిచ్చారు.

    Tags