Mohan Babu : క్రమశిక్షణ కి మారుపేరు లాంటి మోహన్ బాబు కుటుంబం లో అసలు ఏమి జరుగుతుంది..?, తన సొంత కష్టం మీద, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి,నేడు ఇండియా లోనే టాప్ మోస్ట్ లెజెండ్స్ లో ఒకరిగా నిల్చిన మోహన్ బాబు కి ఏది సులభంగా రాలేదు. రేయింబవళ్లు కష్టపడి పని చేసి, ఒక క్రమశిక్షణ తో ఎదిగిన వ్యక్తి ఆయన. విద్యానికేతన్ అనే విద్య సంస్థలను ప్రారంభించి ఎన్నో వేలమందికి చదువు చెప్పి, వాళ్లందరికీ క్రమశిక్షణ నేర్పించాడు. నేడు వాళ్లంతా వివిధ రంగాల్లో గొప్ప స్థానాల్లో స్థిరపడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే మోహన్ బాబు గురించి ఎన్నో ఉన్నాయి. పరువు, మర్యాదల కోసం ప్రాణాలను సైతం ఇచ్చే మోహన్ బాబు కి సంబంధించిన ఇంట్లో గొడవలు రోడ్డు మీదకు ఎందుకు వస్తున్నాయి. మంచు మనోజ్ ఆయన రెండవ భార్య కి పుట్టిన బిడ్డ.
అందుకని ఆయన మనోజ్ పట్ల వివక్ష చూపిస్తున్నాడా?, ఆస్తుల విషయాల్లో ఇంత గొడవలేంటి అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు. గత ఏడాది మంచు మనోజ్ తన ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ లో తన సోదరుడు మంచు విష్ణు తన పై దాడి చేయడానికి మనుషులతో కలిసి వచ్చాడని ఒక వీడియో రికార్డు చేసి పెట్టాడు. ఇది అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఇది కాసేపు పక్కన పెడితే నిన్న రాత్రి మోహన్ బాబు తో మనోజ్ కి పెద్ద గొడవలయ్యాయి అని, మోహన్ బాబు తనపై, తన భార్య మౌనిక రెడ్డి పై దాడి చేసాడని, మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు వార్తలు వినిపించాయి. ఈ విషయం బయటకి రాగానే వైల్డ్ ఫైర్ లాగా ఇండస్ట్రీ మొత్తం వ్యాప్తి చెందింది. ఎంతో పరువుతో బ్రతికిన మోహన్ బాబు కి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి అని ఆయన్ని అభిమానించే వాళ్ళు బాధపడ్డారు.
అయితే సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వ్యాప్తి చెందిన ఈ వార్తలపై మోహన్ బాబు పీఆర్ టీం స్పందించింది. మోహన్ బాబు పై మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు అనే విషయంలో ఎలాంటి వాస్తవం లేదని, ఎవరో కావాలని ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. అయితే సోషల్ మీడియా లో ప్రచారమయ్యే ప్రతీ రూమర్ పై స్పందించే అలవాటు ఉన్న మనోజ్, ఈ విషయం పై ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి. పెద్దల సామెత ప్రకారం నిప్పు లేనిదే పొగ రాదు. ఏమి జరగకపోతే ఇలాంటి వార్తలు ప్రచారం అవ్వవు, కేవలం తన కుటుంబ పరువు రోడ్డు పాలు కాకుండా ఉండేందుకు మోహన్ బాబు ఇలా కవర్ చేస్తున్నాడని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్ల కామెంట్స్ చేస్తారు. మరి ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకోబోతుందో చూడాలి.