Modern Love Hyderabad Review: రివ్యూ : మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్

Modern Love Hyderabad Review: రివ్యూ:  మోడ్రన్ లవ్ హైదరాబాద్  వెబ్ సిరీస్ ఎపిసోడ్స్: 6 ఓటీటీ వేదిక: ప్రైమ్ వీడియో నటీనటులు: ఆది పినిశెట్టి, నిత్యా మీనన్, రీతు వర్మ, సుహాసిని, రేవతి, నరేష్, మాళవిక నాయర్, అభిజీత్ దుద్దాల, నరేష్ అగస్త్య, కోమలీ ప్రసాద్, ఉల్కా గుప్తా దర్శకత్వం : నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుధానం నిర్మాత: ఎలాహీ హిప్టూల సంగీత దర్శకుడు: ఎం ఎం కీరవాణి, స్మరన్ సాయి […]

Written By: Shiva, Updated On : July 23, 2022 7:58 pm
Follow us on

Modern Love Hyderabad Review: రివ్యూ:  మోడ్రన్ లవ్ హైదరాబాద్  వెబ్ సిరీస్

ఎపిసోడ్స్: 6

ఓటీటీ వేదిక: ప్రైమ్ వీడియో

నటీనటులు: ఆది పినిశెట్టి, నిత్యా మీనన్, రీతు వర్మ, సుహాసిని, రేవతి, నరేష్, మాళవిక నాయర్, అభిజీత్ దుద్దాల, నరేష్ అగస్త్య, కోమలీ ప్రసాద్, ఉల్కా గుప్తా

దర్శకత్వం : నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుధానం

నిర్మాత: ఎలాహీ హిప్టూల

సంగీత దర్శకుడు: ఎం ఎం కీరవాణి, స్మరన్ సాయి

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది

ఎడిటర్: రవితేజ గిరజాల

Modern Love Hyderabad Review

అమెరికన్ టెలివిజన్ సిరీస్  ‘మోడ్రన్  లవ్’  ఆధారంగా తెరకెక్కిన  ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’  ప్రస్తుతం  ఓటీటీ  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.  అమెజాన్ ప్రైమ్ వీడియోలో  విడుదలైన  ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో  రివ్యూ  చూద్దాం.

Also Read: Superstar Krishna Second Marriage: కృష్ణ గారు రెండవ పెళ్లి చేసుకోవడానికి ఆయన మొదటి భార్య ఇందిరా గారిని ఒప్పించినా వ్యక్తి ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు.

ఎపిసోడ్ 1 రివ్యూ : 

కథ: 

నూరి (నిత్యా మీనన్)  ప్రేమ వివాహం ఆమె తల్లి మెహరున్నీషా (రేవతి) అంగీకరించదు.  దాంతో నూరి ఇంటి నుంచి వచ్చేసి పెళ్లి చేసుకుంటుంది. అయితే,  ఆరేళ్ల తర్వాత కూతురు దగ్గరకు వస్తోంది తల్లి.  మరి ఈ కూతురు – తల్లి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ?  ఇద్దరి జీవితాల్లో జరిగిన ముఖ్యమైన పరిణామాలు ఏమిటి ? అనేది ఫస్ట్ ఎపిసోడ్ కథ.

Modern Love Hyderabad Review

ఈ ఎపిసోడ్   ఎలా ఉంది అంటే  ?:

నిత్యా మీనన్, రేవతి ఇద్దరూ తమ నటనతో మెప్పించారు.  ప్రతి  సీన్‌ లో  తమ  ఎక్స్‌ప్రెష‌న్స్‌ తో   ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వకుండా ఇద్దరు అద్భుతంగా నటించారు.   ఇష్టాన్ని, ప్రేమను, కోపాన్ని… ఇలా  ప్రతి భావోద్వేగాన్ని  చాలా గొప్పగా పలికించారు.  దర్శకుడు నగేష్ కుకునూర్ కూడా చక్కగా  ఈ ఎపిసోడ్ ను తెరకెక్కించాడు.  చాలా హృద్యంగా ఆవిష్కరించిన ఈ ఎపిసోడ్ లో  కొంత స్లో నేరేషన్ కూడా ఉంది.  కొన్ని సీన్స్ మెలో డ్రామాలా అనిపిస్తాయి.   ఓవరాల్ గా మాత్రం  ఈ ఎపిసోడ్ బాగుంది.

ఎపిసోడ్ 2 రివ్యూ : 

కథ: 

రేణు అలియాస్ రేణుక (రీతూ వర్మ),  ఉదయ్ (ఆది పినిశెట్టి)  ఇద్దరూ సహ జీవనంలో ఉంటారు. అయితే.. చెప్పుల స్టాండ్  దగ్గర మొదలైన వీరి గొడవ పెరిగి పెరిగి పెద్దది అయ్యి, ఇద్దరి మధ్య  బాగా గొడవలు జరుగుతాయి.  ఆ తర్వాత ఏమి జరుగుతుంది ?,  రేణు (రీతూ వర్మ) –  ఉదయ్ (ఆది పినిశెట్టి) జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ?  అనేది మిగిలిన కథ.

Modern Love Hyderabad Review

ఈ ఎపిసోడ్ ఎలా ఉంది అంటే  ?:

నటన పరంగా  ఇటు  ఆది పినిశెట్టి, అటు రీతూ వర్మ పోటీ పడి మరీ నటించారు.  మోడ్రన్ రిలేషన్షిప్స్, కపుల్స్ మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ?,  అవి కపుల్స్ మధ్య ఎంత దూరాన్ని పెంచుతాయి అనే కోణాన్ని  నగేష్ కుకునూర్ బాగా చూపించాడు.  కాకపోతే, ఈ కథలో ఎలాంటి  కొత్తదనం లేదు.  లివ్ ఇన్ అంటే..  ఓన్లీ శృంగారాత్మక కోణాన్ని చూపించడం మాత్రమే అని దర్శకుడు భావించడం నిరాశ పరుస్తోంది.  ఇదే  ఈ ఎపిసోడ్ కి పెద్ద మైనస్ పాయింట్.  మొత్తం ఆరు ఎపిసోడ్ లు చూశాక… ఈ ఎపిసోడ్ గుర్తుండటం కష్టమే.

ఎపిసోడ్ 3 రివ్యూ : 

కథ: 

రోహన్ (నరేష్ అగస్త్య)  జీవితంలో చాలా కిందిస్థాయి నుంచి  పెద్ద కంపెనీకి సీఈవోగా ఎదుగుతాడు.  ఐతే, ఉన్నత స్థాయికి ఎదిగినా..  అతని బాల్యం మాత్రం అతడిని వెంటాడుతూనే ఉంటుంది.  చిన్నతనంలో తనను అనాథ ఆశ్రమంలో చేర్పించిన అమ్మమ్మ (సుహాసిని) కోసం అతను పరితపిస్తూనే ఉంటాడు. అసలు తన అమ్మమ్మ (సుహాసిని) తనను ఎందుకు వదిలేసింది ?, చివరకు  ఈ విషయాన్ని  రోహన్ ఎలా తెలుసుకున్నాడు? అనేది మిగిలిన  కథ.

Modern Love Hyderabad Review

 

ఈ ఎపిసోడ్   ఎలా ఉంది అంటే  ?:

వినేటప్పుడు కథ చాలా చిన్నది అని అనిపించవచ్చు. కానీ,  స్క్రీన్ మీద చూస్తే..  ఈ కథలో చాలా  లోతు ఉందనిపిస్తోంది. అంత గొప్పగా  నటీనటులు తమ పాత్రల్లో జీవించారు.  సాధారణమైన సన్నివేశాలను కూడా  సుహాసినీ మణిరత్నం తన నటనతో  గొప్ప స్థాయిలో నిలబెట్టారు.  నరేష్ అగస్త్య కూడా అద్భుతంగా నటించాడు.  నగేష్ కుకునూర్ ఈ ఎపిసోడ్ ను చాలా సహజంగా తీశారు.  ఈ కథలో భావోద్వేగమే కాదు,  పాత్రలు కూడా చాలా  బాగా ఆకట్టుకుంటాయి.

ఎపిసోడ్ 4 రివ్యూ : 

కథ: 

అశ్విన్ (అభిజీత్) ఒక టీవీ  ప్రొడ్యూసర్.  రొటీన్ సీరియల్స్ చేయడం అతనికి నచ్చదు.  కొత్తగా  ఓటీటీ స్పేస్‌లో ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తాడు.  అనుకోకుండా ఓ రోజు  స్టాండప్ కమెడియన్ విన్నీ (మాళవికా నాయర్)ను  చూస్తాడు.  తెలుగబ్బాయి థీమ్ మీద విన్నీ  చేసిన స్టాండప్ షో  అశ్విన్ (అభిజీత్)కి బాగా నచ్చుతుంది. ఆమెతో షో చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో ఇద్దరూ  ప్రేమలో పడతారు. ఐతే,  వీరి ప్రేమ కారణంగా  వీరి వృత్తి పై  ఆ ప్రేమ ఎలాంటి  ప్రభావం చూపింది ?  చివరకు  ఏమైంది? అనేది మిగిలిన కథ.

Modern Love Hyderabad Review

ఈ ఎపిసోడ్ ఎలా ఉంది అంటే  ?:

ఈ ఎపిసోడ్ ఏవరేజ్ గా ఉంది.  స్టాండప్ కామెడీ సీన్స్  పండలేదు.  మాళవికా నాయర్ నటన మాత్రం చాలా బాగుంది.  ఆమె బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా కుదిరింది.  దర్శకుడు ఉదయ్ గుర్రాల ప్రతి అంశాన్ని సున్నితంగా డీల్ చేసే ప్రయత్నం చేసినా   పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ..  ప్రతి సీన్ చాలా  సెటిల్డ్‌గా సాగుతుంది. ఐతే,  ఈ ఎపిసోడ్ ఓ వర్గం ప్రేక్షకులను మాత్రం  చాలా బాగా ఆకట్టుకుంటుంది.

ఎపిసోడ్ 5 రివ్యూ : 

కథ: 

స్నేహ (ఉల్కా గుప్తా) జాబ్ చేస్తూ ఉంటుంది.  తనకు కాబోయే భర్తను  తానే నిర్ణయించుకోవాలని  మ్యాట్రిమోనియల్ సైట్స్‌లో అబ్బాయిల ప్రొఫైల్స్ చూస్తూ వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. ఐతే, స్నేహ పై   ఆమె తండ్రి (నరేష్)కి నమ్మకం ఉండదు.  స్నేహ అబ్బాయిలను  కలవడానికి వెళ్లిన ప్రతిసారీ స్నేహకు తెలియకుండా  ఆమె తండ్రి (నరేష్) ఫాలో అవుతూ ఉంటాడు.  ఈ విషయం తెలిసి స్నేహ   ఏం చేస్తోంది ?  చివరకు కూతురు స్నేహ విషయంలో  ఆమె తండ్రి అభిప్రాయం మారిందా ? లేదా ? అనేది మిగిలిన  కథ.

Modern Love Hyderabad Review

ఈ ఎపిసోడ్   ఎలా ఉంది అంటే  ?:

ఈ ఎపిసోడ్  చాలా సింపుల్ గా  సాగింది.  కాలం మారినా తల్లిదండ్రుల ప్రేమ, బాధ్యత పై వారికున్న అభిప్రాయం ఎలా ఉంటుంది అని చెప్పే కథ ఇది.  పిల్లల విషయంలో తల్లిదండ్రుల ఫీలింగ్స్ ను  ఈ కథలో  చూపించే ప్రయత్నం చేశారు. ఉల్కా గుప్తా, నరేష్, దివ్యవాణి… ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు తగ్గట్టు నటించారు. కాకపోతే..  సీన్స్, అలాగే ఆ సీన్స్ ను  తీసిన విధానం కూడా చాలా రొటీన్‌గానే ఉంది.  పైగా బోరింగ్ ప్లేతో నిరాశ పరిచారు.  అందుకే,  ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు  కనెక్ట్ కాదు.

ఎపిసోడ్ 6  రివ్యూ : 

కథ : 

ఇందు (కోమలీ ప్రసాద్) ఒక మైక్రో బయాలజీ స్టూడెంట్.  ఓ రోజు  తన బాయ్‌ ఫ్రెండ్‌ వేరే అమ్మాయిని కిస్ చేస్తూ  కనిపిస్తాడు.  దాంతో అతనికి బ్రేకప్ చెబుతుంది.  ఆ తర్వాత, తనకు సరైన పార్ట్‌న‌ర్‌ వెతుక్కునే క్రమంలో స్ట్రగుల్ అవుతుంది. పైగా తనకు కాబోయే  పార్ట్‌న‌ర్‌ కోసం  యానిమల్స్ ట్రై చేసే మెథడ్స్ అన్నీ  ట్రై చేస్తోంది. చివరకు, తనకు తగిన వాడిని ఇందు (కోమలీ ప్రసాద్) వెతుక్కుందా? లేదా?, ఆమె కథ ఎలా సాగింది ?  అనేది మిగిలిన  కథ.

Modern Love Hyderabad Review

 

ఈ ఎపిసోడ్  ఎలా ఉంది అంటే  ?:

ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ ఎలా ఉన్నా..  చివరకు ఈ ఎపిసోడ్ లో  ఏం చెప్పారు ? అన్నదే కీలకం.  కానీ.. ముగింపు పూర్తిగా ఆకట్టుకోదు.  దర్శకుడు వెంకటేష్ మహా తెలివిగా స్రీన్ ప్లే రాసుకునే ప్రయత్నంలో అతి తెలివి జోడించాడు. కానీ.. కోమలీ ప్రసాద్ నటన, కొన్ని సీన్స్ నవ్విస్తాయి. దాంతో చాలా సీన్స్ ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ పెంచాయి.  కాకపోతే,  యానిమల్స్, లవ్ అంటూ చెప్పే విషయం అసలు అర్థం కాదు. ఈ విషయంలో దర్శకుడు కొంత జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది.

ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలా ఉంది అంటే ?     

మొత్తమ్మీద  ఈ ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ సిరీస్‌లో  కొన్ని కథలు, కొన్ని పాత్రలు మనసులను హత్తుకుంటాయి.  కానీ,  ఏపీలోని  రోడ్స్  లాగే,  కొన్ని కథల్లో  మాత్రం  చాలా ఎత్తు పల్లాలు ఉన్నాయి.  మనసులను హత్తుకునే కథలతో పాటు..  కాస్త నిరాశకు గురి చేసిన సన్నివేశాలు కూడా ఈ సిరీస్ లో ఉన్నాయి.

కానీ.. సగటు ప్రేక్షకుడికి  మాత్రం  ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. హైదరాబాద్ నేపథ్యాన్ని కూడా  ఈ సిరీస్ లో అద్భుతంగా చూపించారు. అలాగే,  ప్రస్తుత సమాజంలోని  బంధాలను, అనుబంధాలను, ప్రేమలను ఆవిష్కరించిన విధానం కూడా చాలా బాగుంది.  అందుకే, ఎంతో  సహజత్వంతో సాగిన  ఈ  ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’  మన మనసుల పై  తనదైన ముద్ర వేస్తోంది.  కాబట్టి..  డోంట్ మిస్ ఇట్.

Also Read:Jabardasth Show- Movie Promote: జబర్దస్త్ షో లో ఒక సినిమాకి ప్రమోషన్ చెయ్యాలంటే ఎంత డబ్బులు చెల్లించాలో తెలుసా?

Tags