Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధుకి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఈ మధ్య ఆమె పై విమర్శలు ఎక్కువ అయ్యాయి. ఒక మిస్ యూనివర్స్ అయ్యి ఉండి.. ఫిజిక్ పై కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు అంటూ హర్నాజ్ సంధు పై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే.. తాజాగా ఈ ట్రోలింగ్ పై హర్నాజ్ సంధు స్పందించింది.

అసలు ఇంతకీ హర్నాజ్ సంధు పై ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే.. ఆమె అధిక బరువు ఉందట. అధిక బరువుకు సంబంధించి ట్రోలింగ్ కామెంట్లు ఎదుర్కొన్న మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు.. వాటి పై తాజాగా స్పందించింది. ‘నాకు ఉదరకుహర (Celiac disease) వ్యాధి ఉంది. మొదట్లో సన్నగా ఉన్నానని, ఆ తర్వాత లావుగా ఉన్నానని వేధించారు. నా వ్యాధి గురించి వారికి తెలియదు.
గోధుమ పిండి మరియు ఇతర ఆహారాలను తినలేను. గ్లూటెన్ తిన్నప్పుడు సెలియక్ వ్యాధి వల్ల రోగనిరోధక వ్యవస్థ కణజాలంపై దాడి చేస్తుంది’ అని ఆమె చెప్పింది. మొత్తానికి తనకు సెలియాక్ డిసీజ్ ఉందని ఈ మిస్ యూనివర్స్ స్పష్టం చేసింది. ఇది ఒక దీర్ఘకాలిక జీర్ణ మరియు రోగనిరోధక రుగ్మత. ఒక రకంగా ఇది చిన్న ప్రేగులను దెబ్బతీస్తుంది.

పైగా గ్లూటెన్ కలిగిన ఆహారం తినడంతో బాగా ఇబ్బందులొస్తాయని వైద్యులు చెబుతూ ఉంటారు. అతిసారం, అలసట, బరువు తగ్గడం, ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, వికారం దీని లక్షణాలు ఈ వ్యాధి వల్ల ఉంటాయి.
ఇక దీనికి చికిత్స లేనప్పటికీ.. గ్లూటెన్-ఫ్రీ డైట్ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలను రోగులు నివారించవచ్చు అని డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు.