https://oktelugu.com/

Miss Shetty Mr Polishetty Box Office Collection : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మొదటి రోజు కలెక్షన్లు ఎన్నో తెలిస్తే తట్టుకోలేరు

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 1 రోజు అన్ని భాషల బాక్స్ ఆఫీస్ కలెక్షన్.. ఇండియా నెట్ కలెక్షన్ 1వ రోజు ₹ 3.00 కోట్లు సంపాదించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

Written By:
  • NARESH
  • , Updated On : September 7, 2023 / 07:55 PM IST

    Miss Shetty Mr Polishetty Review

    Follow us on

    Miss Shetty Mr Polishetty Box Office Collection : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ ప్రధానంగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. స్టాండప్ కమెడియన్ గా నవీన్ పోలిశెట్టి కనిపించారు. సినిమాలో ఆయనే ప్రధాన ఆకర్షణ అంటున్నారు. తన హిలేరియస్ కామెడీ, ఎనర్జీతో నవీన్ ఆద్యంతం సినిమాను ఆకట్టుకునేలా నడిపించాడని అంటున్నారు. స్టాండప్ కమెడియన్ పాత్రలో ఆయన రోల్ సహజంగా ఉందంటున్నారు.

    అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ పై కనిపించడం పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెఫ్ గా అనుష్క మెప్పించే ప్రయత్నం చేసింది. సెట్టిల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకుందని ప్రేక్షకుల అభిప్రాయం. నవీన్, అనుష్క మధ్య రొమాంటిక్ సీన్స్, కామెడీ వర్క్ అవుట్ అయ్యింది. ఎమోషనల్ గా కొంత మేరకు కనెక్ట్ అయ్యిందంటున్నారు. అయితే సినిమా సాగదీతకు గురైంది. అక్కడక్కడా బోరింగ్ గా ఉంటుందని అంటున్నారు. సాంగ్స్, మ్యూజిక్ పర్లేదు అంటున్నారు. ఓవరాల్ గా డీసెంట్ మూవీ. ఒకసారి చూడొచ్చు అంటున్నారు.

    మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్.. ఆక్యుపెన్సీ ఇలా ఉన్నాయి.

    మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అన్ని భాషల్లో మొదటి రోజు 3.00 కోట్ల వరకూ దేశవ్యాప్తంగా నికర ఆదాయం సంపాదించింది.

    మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 1 రోజు అన్ని భాషల బాక్స్ ఆఫీస్ కలెక్షన్.. ఇండియా నెట్ కలెక్షన్ 1వ రోజు ₹ 3.00 కోట్లు సంపాదించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం… మొత్తం ₹ 3.00 కోట్లు మొత్తం 33.77% తెలుగు ఆక్యుపెన్సీని కలిగి ఉన్నారు.

    మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డే 1 తెలుగు (2డి) థియేటర్లలో ఆక్యుపెన్సీ చూస్తే..

    మార్నింగ్ షోలు: 18.15%

    మధ్యాహ్నం షోలు: 36.68%

    సాయంత్రం షోలు: 46.47%

    రాత్రి ప్రదర్శనలు: 0%

    మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి గురువారం నాడు మొత్తం 16.13% తమిళ ఆక్యుపెన్సీని కలిగి ఉన్నారు.

    మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డే 1 తమిళ (2డి) థియేటర్లలో ఆక్యుపెన్సీ

    మార్నింగ్ షోలు: 7.75%

    మధ్యాహ్నం షోలు: 14.54%

    సాయంత్రం షోలు: 26.10%

    రాత్రి ప్రదర్శనలు: 0%