Miss Shetty Mr Polishetty Collections: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 9వ రోజు వసూళ్లు… అనుష్క గ్రేట్ కమ్ బ్యాక్!

అలాంటి కోవలోకే వస్తుంది తాజాగా విడుదలైన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా. టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అనుష్క ,యంగ్ స్టార్ నవీన్ పొలిశెట్టి కలిసి నటించిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే సూపర్ హిట్ దిశగా వెళ్తుంది.

Written By: Shiva, Updated On : September 16, 2023 1:53 pm

Miss Shetty Mr Polishetty Collections

Follow us on

Miss Shetty Mr Polishetty Collections: ఈనాటి ఇంటర్నెట్ ప్రపంచంలో ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంది. అందుకు సినీ పరిశ్రమ , సినిమా రివ్యూస్ అతీతమేమీ కాదు. ఒక సినిమా విడుదలై మొదటి షో పూర్తి కావడం ఆలస్యం. సినిమా హిట్టా ఫట్టా అనేది వెంటనే తెలిసిపోవడం , వైరల్ అవ్వటం ఖాయం. దానిని బట్టి మెజారిటీ జనాలు సినిమా కు రావాలా ? వద్దా ? అనేది నిర్ణయించుకుంటారు. అయితే కొన్ని సినిమాల విషయంలో మొదటి రోజు పబ్లిక్ టాక్ తో సంబంధం లేకుండా కేవలం మౌత్ టాక్ తోనే కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి.

అలాంటి కోవలోకే వస్తుంది తాజాగా విడుదలైన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా. టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అనుష్క ,యంగ్ స్టార్ నవీన్ పొలిశెట్టి కలిసి నటించిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే సూపర్ హిట్ దిశగా వెళ్తుంది. అనుష్క లాంటి హీరోయిన్ నవీన్ తో కలిసి నటిస్తుందని తెలియగానే ఈ సినిమాలో ఏదో మ్యాటర్ ఉందని అందరూ అనుకున్నారు . దానికి తగ్గట్లే డిఫరెంట్ స్టోరీ తో తెరకెక్కిన ఈ సినిమాను ఇటు యూత్ అటు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు.

ఏ సినిమా విజయమైన దానికి వస్తే కలెక్షన్స్ ను బట్టి నిర్ణయిస్తారు. ఈ విధంగా చూసుకుంటే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా సూపర్ హిట్ అనే చెప్పాలి. సినిమా విడుదలై ఇప్పటికి పది రోజులు అవుతున్న బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు స్టడీగానే కొనసాగుతున్నాయి. ఈ సినిమా రెండో శుక్రవారం అంటే తొమ్మిదో రోజు కూడా దాదాపు ఒక కోటికి పైగా నెట్ వసూళ్లు చేసింది. మొదటి ఎనిమిది రోజుల్లో 17 . 75 కోట్ల నెట్ వసూళ్లు చేసిన ఈ సినిమా తొమ్మిదో రోజు తో కలిసి దాదాపు 19 కోట్ల నెట్ దాక కలెక్ట్ చేసింది.

మరోపక్క ఓవర్శిస్ లో కూడా ఈ సినిమా 1. 5 మిలియన్ క్లబ్ కు చేరువలో ఉంది. ఈ సినిమాకు ఈ వీకెండ్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. తెలుగులో చెప్పుకోదగిన సినిమాలు ఏవి విడుదల కాలేదు. రవితేజ నిర్మాతగా తెరకెక్కించిన ఛాంగురే బంగారు రాజా సినిమా కు నెగిటివ్ టాక్ రావడంతో తెలుగు ఆడియన్స్ మొదటి ఛాన్స్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఫైనల్ రన్ లో దాదాపు 25 కోట్ల నెట్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్న మాట