Minister Roja Allari Naresh : తన చిరకాల వాంఛ అయిన మంత్రి పదవి దక్కడంతో రోజాకు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అందుకే తనకు గతంలో సాయం చేసిన సీఎం కేసీఆర్ నుంచి మొదలుకొని అందరినీ కలుస్తోంది. ఇక ప్రతీ గుడికి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటోంది. పలు ఆలయాలను సందర్శిస్తోంది. మంత్రి అయిన తర్వాత తనకు ఎంతో ఇష్టమైన జబర్ధస్త్ కు గుబ్ బై చెప్పి ఇక ప్రజా సేవలోనే తరిస్తోంది. అయితే హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లరి నరేశ్ తో మంత్రి రోజాకు ఒక అనుబంధం ఉందని తాజాగా బయటపడింది.

ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన హీరోయిన్లలో రోజా ఒకరు. స్టార్ హీరోలందరి సరసన నటించిన రోజా ఎన్నో హిట్లను అందుకుంది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా సినిమాలు తగ్గించేశారు. తాజాగా తన సమయాన్ని పూర్తిగా రాజకీయాలకే కేటాయించారు.
ఇక అల్లరి నరేశ్ హీరోగానే కాకుండా మంచి కమెడియన్ గా నిరూపించుకున్నారు. ‘గమ్యం’, నాంది సినిమాలతో తనలోని యాక్టింగ్ లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు.
అప్పట్లో జబర్ధస్త్ స్టేజీపై నరేశ్ మెరిసిన సందర్భంగా వీరి మధ్యన ఒక ఆసక్తికర సీన్ చోటుచేసుకుంది. రోజాతో పాటు స్టేజీపై డ్యాన్స్ చేసిన అల్లరి నరేశ్ ఆమెను ఎత్తుకొని గిరిగిరా తిప్పడం అందరినీ ఆకర్షించింది. అవాక్కయ్యేలా చేసింది.
అల్లరి నరేశ్ మాట్లాడుతూ.. రోజా గారితో తాను ఒక సినిమాలో నటించానని.. కానీ ఆమె పక్కన హీరోగా చేయలేదన్నారు. అందుకే జబర్ధస్త్ కు వచ్చిన ప్రతీసారీ ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుందని చిలిపికామెంట్లను రోజా చేశాడు.
మరోవైపు రోజా మాట్లాడుతూ ‘సీతారత్నం గారి అబ్బాయి’ సినిమా సమయంలో అల్లరి నరేశ్ స్కూల్ కు వెళ్లేవాడు. అప్పుడు నేను ఎత్తుకొని ఆడేదాన్ని. ఇప్పుడు నన్నే ఎత్తుకొని ఆడుతున్నాడు అంటూ రోజా చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
సీతారత్నం గారి అబ్బాయి చిత్రానికి అల్లరి నరేశ్ తండ్రి దివంగత ఈవీవీ సత్యనారాయణ దర్శకుడు. ఆ సమయంలో అల్లరి నరేశ్ ను ఎత్తుకొని రోజా ఆడించింది. దాన్నే గుర్తు చేసుకుంది. అంతేకానీ.. రోజాకు, అల్లరి నరేశ్ కు మధ్య ఎటువంటి బంధుత్వం లేదు.