Minister Puvwada Ajay- Junior NTR: ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో క్షణం నిన్నటి వరకు జరిగింది.భారీ యాక్షన్ సన్నివేశాన్ని ఈ షెడ్యూల్ లో తెరకెక్కించారు, ఎన్టీఆర్ తో పాటుగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నాడు, ఇందులో ఆయన పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు.
ఈ షూటింగ్ లో బిజీ గా ఉన్న సమయం లోనే ఎన్టీఆర్ ని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ షూటింగ్ లొకేషన్ లో కలిసాడు. ఖమ్మం లో త్వరలోనే 56 అడుగులు ఎత్తు ఉన్న చెయ్యబోతున్నారు. ఈ విగ్రహావిష్కరణ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా జరగనుంది.
ఇందుకోసం గా జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించేందుకు మంత్రి పువ్వాడ ఆయనని కలిశారు, దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఎంతో మంది ఉండగా , జూనియర్ ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారంటే, తెలంగాణ ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ కి ఇస్తున్న విలువ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
రీసెంట్ గా ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలు విజయవాడ లోని పోరంకి మండలం లో జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు కానీ , సొంత కుటుంబ సభ్యుడైన జూనియర్ ఎన్టీఆర్ ని మాత్రం ఆహ్వానించలేదు. ఇది ఆయన అభిమానులకు చాలా ఆగ్రహానికి గురి చేసిన విషయం, తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ కి ఇచ్చిన ప్రాముఖ్యత , సొంత నందమూరి కుటుంబ సభ్యులు ఇవ్వకపోవడం శోచనీయం అనే చెప్పాలి.