Udaya Bhanu New Home: తెలుగులో ఫస్ట్ స్టార్ యాంకర్ అంటే ఉదయభానునే. ఈ పొడుగు భామ కొన్నాళ్లు బుల్లితెరను ఏలారు. ఉదయభాను యాంకర్ గా చేసిన ‘సాహసం చేయరా డింభకా’, ఒన్స్ మోర్ ప్లీజ్, జాణవులే నెరజాణవులే అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. యాంకర్ ఉదయభాను అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండేవాడు కాదు. ఆ స్థాయిలో ఉదయభాను ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలో ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. హీరోయిన్ గా నటించారు. ఐటెం సాంగ్స్ లో నటించారు. కమెడియన్ వేణు మాధవ్ తో కలిసి ఉదయభాను షోలు చేయడం విశేషం.
మంచి హైట్, హుషారు కలిగి తెలంగాణా యాసలో దుమ్మురేపే ఉదయభాను స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ అనుభవించారు. అప్పట్లో ఉదయభానుకు సుమ కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఉదయభాను తర్వాత సుమ, ఝాన్సీ అన్నట్లు ఉండేది. కెరీర్ పీక్స్ లో ఉండగా ఉదయభానును వ్యక్తిగత వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో సడన్ గా పరిశ్రమకు దూరమైంది. అప్పట్లో ఉదయభాను ఏమైందనే చర్చ నడిచింది. ఆమెను కావాలనే కొందరు తొక్కేశారనే వాదనలు వినిపించాయి.
2004లో ఉదయ్ భాను వివాహం చేసుకున్నారు. ఆమె భర్త పేరు విజయ్ కుమార్. ఉదయభానుకు ఇద్దరు సంతానం. కవల అమ్మాయిలు పుట్టారు. ఇటీవల ఆమె కొంచెం యాక్టీవ్ అయ్యారు. టెలివిజన్ షోలు, సినిమా ఈవెంట్స్ చేస్తున్నారు. తిరిగి పరిశ్రమలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయభాను ఒక యూట్యూబ్ ఛానల్ కలిగి ఉన్నారు. అందులో అభిమానుల కోసం ఆసక్తికర వీడియోలు చేస్తుంటారు. తాజాగా ఆమె తన కొత్త ఇంటిని ప్రేక్షకులకు చూపించారు. ఉదయభాను హోమ్ టూర్ వీడియో వైరల్ అవుతుంది.
గతంలో ఉదయభాను ఫ్యామిలీ హైటెక్ సిటీలో ఉండేవారట. పిల్లల స్కూల్ కి తమ నివాసానికి దూరమైందట. ప్రతి రోజూ రావడానికి ఒక గంట పోవడానికి ఒక గంట సమయం పడుతుందా పిల్లలు అలసిపోతున్నారట. అందుకే పిల్లల స్కూల్ కి దగ్గర్లో ఈ కొత్త ఇంటిని నిర్మించుకున్నారట. రిచ్ కమ్యూనిటీ మధ్య ఉన్న ఉదయభాను లగ్జరీ హౌస్ అద్భుతం అని చెప్పాలి. ఆధునిక హంగులతో విశాలంగా నిర్మించారు. ఉదయభాను హౌస్ చూశాక ఆమె రేంజ్ ఏంటో అర్థమైందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.