Miles of Love: హుషారు చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు అభినవ్ మేడిశెట్టి. ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి హిట్ అందుకుంది. ఉండి పోరాదే సాంగ్ తో అభినవ్ మేడిశెట్టి ప్రేక్షకుల్లో గుర్తుండిపోయారు అనే చెప్పాలి. ప్రస్తుతం మరొక చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నారు అభినవ్.

కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై కంతాల వెంకట రాజి రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “మైల్స్ ఆఫ్ లవ్”. ఈ సినిమాలో అభినవ్ మేడిశెట్టికి జోడిగా రమ్య పసుపులేటి నటిస్తున్నారు. ఉపేంద్ర కుమార్ కయ్యం అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు కూడా ఇటీవలే విడుదలయ్యాయి. “సిద్ శ్రీరామ్” ఈ మూవీలో ఒక పాట ఆలపించారు. కాగా ఆ సాంగ్ యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది అని మూవీ యూనిట్ చెబుతున్నారు.
ఇటీవల హైదరాబాదులో జరిగిన మూవీ కి సంబంధించిన వేడుకలో ముఖ్య అతిథిగా హీరో కార్తికేయ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమాలో పాటలు కూడా బాగున్నాయని… ధ్రువన్ మంచి సంగీతం ఇచ్చారని కార్తికేయ అన్నారు. ఈ మూవీ ఈ నెల 29న విడుదల కానుందని… యూత్ కి బాగా నచ్చే అన్నీ అంశాలు దృష్టిలో ఉంచుకొని ఈ సినిమనీ తెరకెక్కించినట్లు సమాచారం అందుతుంది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో… లేదో తెలియాలంటే ఈ నెల 29 వరకు వేచి చూడక తప్పదు.
