Vijay Devarakonda: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం లైగర్. విడుదలకు ముందు ఎంతో సందడి చేసింది. సినిమా విడుదలయ్యాక అందరు ఆశ్చర్యపోతారని విజయ్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. నిజంగానే సినిమా విడుదలయ్యాక అందరు ఆశ్చర్యపోయారు. సినిమా ఓ రేంజ్ లో హిట్ అవుతుందని భావిస్తే చివరకు ఫట్ అయింది. దీంతో నిజంగానే అందరు ఫిదా అయిపోయారు. పూరీ జగన్నాథ్ స్టామినా తెలిసిపోవడంతో సినిమా కచ్చితంగా హిట్టే అని నమ్మారు. తీరా విడుదలయ్యాక కానీ తెలియలేదు.

సినిమా విడుదలకు ముందు ట్రైలర్, పోస్టర్, టీజర్, పాటలు ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తాయని అనుకున్నా చివరకు కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాడినట్లు అయింది. ఏదో బ్రహ్మాండం బద్దలవుతుందని అందరిని నమ్మించినా చివరకు వారే బొక్క బోర్లా పడ్డారు. సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ నటన, పూరీ స్టామినా వృథా అయ్యాయని తెలుస్తోంది. లైగర్ సినిమా విడుదల కంటే ముందే ఎంతో క్రేజీ తెచ్చుకున్నా విడుదలయ్యాక మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయింది.
Also Read: Asia Cup 2022 India vs Pakistan: ఇండియా, పాక్ మ్యాచ్ చూస్తే అంతే.. రూ. 5 వేలు జరిమానా
ఇక సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ మైక్ టైసన్. సినిమాలో బాక్సర్ గా నటించిన విజయ్ దేవరకొండ టైసన్ పై ఆసక్తికర కామెంట్లు చేశాడు. మైక్ టైసన్ బూతులు తిట్టేవాడని చెప్పాడు. అయితే అది కోపంతో కాదని ప్రేమతోనే తిట్టేవాడని వివరించాడు. లైగర్ మూవీ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. మైక్ టైసన్ కు ఇక్కడి ప్రజలన్నా ఆహారమన్నా ఎంతో ఇష్టం. అందుకే మనపై ప్రేమ చూపించేవాడని కొనియాడాడు.

ఓసారి ఇండియాకు వచ్చినప్పుడు ఆయనను చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో ఆయన భయంతో హోటల్ లోనే ఉండిపోయారు. బయటకు రాలేదు. దీంతో మైక్ టైసన్ గురించి ఎన్నో విషయాలు చెప్పాడు విజయ్. మొత్తానికి లైగర్ సినిమాలో మైక్ టైసన్ ను పెట్టి తీసినా అది మాత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. ఇందులో కొన్ని నెగెటివ్ ఆలోచనలు కూడా ఉన్నాయట. అందుకే సినిమా బోల్తాపడిందని అభిమానుల అభిప్రాయం. పూరీ జగన్నాథ్ పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందని తెలుస్తోంది.
Also Read:Vijay Deverakonda: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న విజయ్ దేవరకొండ
[…] Also Read:Vijay Devarakonda: మైక్ టైసన్ బూతులు తిట్టేవాడు.. … […]