Michael movie worldwide collections: ఫ్లాప్ టాక్ తో మొదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి ‘మైఖేల్'(Michael Movie). పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేశారు. దీనికి క్రిటిక్స్ నుండి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. చాలా మంది డిజాస్టర్ ఫ్లాప్ అంటూ కూడా కామెంట్స్ చేశారు. కానీ అలాంటి నెగెటివ్ రివ్యూస్ అన్నిటిని దాటుకొని ఈ చిత్రానికి సెన్సేషనల్ గ్రాస్ నమోదు అయ్యిని. ట్రేడ్ పండితులు సైతం ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లను చూసి నోరెళ్లబెడుతారు . ఇండియన్ భాషల్లో ఈ చిత్రానికి పెద్దగా గ్రాస్ వసూళ్లు రాలేదు కానీ, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఎంతొచ్చిందో ఒకసారి చూద్దాం.
ఈ చిత్రానికి డొమెస్టిక్ మార్కెట్ నుండి, అనగా నార్త్ అమెరికా మార్కెట్ నుండి దాదాపుగా 97 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే ‘అవతార్ : ది ఫైర్ & యాష్’ చిత్రం కంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయి అన్నమాట. మైఖేల్ జాక్సన్ చనిపోయి 18 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా అమెరికన్స్ లో ఆయన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో అయితే ఈ చిత్రానికి 120 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే ఓవరాల్ గా మొదటి మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి 217 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చిందని, బయోపిక్స్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం గా ‘మైఖేల్’ ప్రపంచ రికార్డుని నెలకొల్పింది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 217 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు అంటే , మన ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపుగా 2043 కోట్ల రూపాయిల గ్రాస్ అన్నమాట.
అంటే మన ఇండియన్ సూపర్ హిట్ మూవీస్ ఫుల్ రన్ లో కూడా రాబట్టలేని వసూళ్లను ఈ చిత్రం కేవలం 3 రోజుల్లో రాబట్టింది అన్నమాట. ఈ చిత్రానికి విడుదలకు ముందు 412 మిలియన్ డాలర్ల బిజినెస్ జరిగిందట. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 4000 వేల కోట్ల పైమాటే. 3 రోజుల్లోనే 52 శాతం రీకవరీ అయ్యిందని , ఫుల్ రన్ లో కచ్చితంగా 1 బిలియన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు. 1 బిలియన్ అంటే 12000 వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట. లాంగ్ రన్ లో స్టడీ ట్రెండ్ ని కొనసాగిస్తే ఈ చిత్రం కచ్చితంగా ‘అవతార్ : ది ఫైర్ & యాష్’ రికార్డుని బద్దలు కొడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
