Mension House Mallesh Movie : మన తెలంగాణ సంస్కృతి చాటి చెప్పే చిత్రాలు ఇప్పుడిప్పుడే జనంలోకి వస్తున్నాయి. అవి గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఫిదా, విరాటపర్వం, బలగం.. ఇలా ఎన్నో ఎన్నొన్నో టాలీవుడ్ లో తెలంగాణ కథలే ఇప్పుడు కలికితురాళ్లుగా నిలుస్తున్నాయి. ఇప్పుడు వాటిని మించి మరో సినిమా వస్తోంది అదే ‘మెన్షన్ హౌస్ మల్లేష్’.. ఈ చిత్రం తెలంగాణ జీవనాడిని ప్రపంచానికి చాటిచెప్పడానికి ముందుకొస్తోంది .
ఇప్పటికే ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ నుంచి తొలి పాట ‘బంగారి.. బంగారి..పెనిమిటీ బంగారి’ అంటూ రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ అచ్చ తెలంగాణ పద బంధం ఇప్పుడు తెలంగాణ మాండలికాన్ని.. తెలంగాణ ప్రేమను, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఎలుగెత్తి చాటుతోంది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బలి తెలంగాణ ఆత్మనే ఈ పాటలో బాణీలుగా పొందుపరిచినట్టుగా శ్రోతలకు వీణుల విందు చేస్తోంది. ఆద్యంతం హృదయాన్నే హత్తుకునే ఈపాట తెలంగాణనే కాదు ప్రపంచాన్ని ఊపేస్తోంది. మనసును మత్తుకుంటోంది. సురేష్ బొబ్బిలి సంగీతం రణగొణ ధ్వనులు లేకుండా, స్పష్టంగా సాహిత్యం వినిపిస్తూ మనసుకి ఆహ్లాదకరంగా ఉంది. హరిణి గానం మెలోడియస్ గా ఉంది.
ఈమధ్య సినిమా పాటలు అనగానే ఇండోర్ సెట్లు, లేదంటే నగర వాతావరణం చూపించడం సర్వసాధారణంగా మారింది. ఇలాంటి ట్రెండ్ లో స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణంలో ఒక తెలుగు పాట, ఆది కూడా, వినిపించే విధంగా ఉండడం ఆశ్చర్యమనిపించక మానదు.
మెన్షన్ హౌస్ మల్లేష్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ.. ఆస్కార్ లెవల్ లో ఈ మూవీచిత్రీకరణ ఫుల్ కలర్ ఫుల్ గా ఉంది. తమిళనాడు నుంచి ఈ డీఓపీ నిజంగా ఓ కళాఖండాన్నే తీశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సినిమాలో హీరో స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఏమోషనల్, ఫైట్ సీన్స్ లో అతడి కసి తెరమీద బాగా కనిపిస్తోంది. హీరోయిన్ తో పెళ్లి తర్వాత సీన్లలోనూ జీవించేశాడు.
ఇక రెగ్యులర్ సినిమాల తరహాలో హీరోయిన్ ను బొంబాయి నుంచి పట్టుకొని రాకుండా గాయత్రి రమణ అనే మన అచ్చ తెలుగు అనంతపురం అమ్మాయికి ఈ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. ఇప్పటికే తను హిట్ 2 లాంటి కొన్ని సినిమాలలో నటించింది. కూచిపూడి డాన్సర్ కావడం వల్ల తన డ్యాన్స్ లో ఈజ్ కూడా ఉంది.
ఓవరాల్ గా మరో అచ్చ తెలంగాణ లాంటి సినిమా మన ముందుకు వస్తోంది. ‘బలగం’లా ఇది తెలంగాణ సమాజాన్ని కదిలించడం ఖాయం.. ఫిబ్రవరిలో ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆరోజు కోసం మనం ఎదురుచూద్దాం..
