
టాలీవుడ్ అగ్రహీరోలు.. ‘ఆర్ఆర్ఆర్’లో కలిసి నటిస్తున్న ఇద్దరు రాములు తాజాగా సందడి చేశారు. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా జెమినీ టీవీలో ప్రసారమైన ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ అనే షోలో పాలుపంచుకున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభమైన ఈ తొలి ఎపిసోడ్ కు రాంచరణ్ గెస్ట్ గా వచ్చాడు. గెస్ట్ గా హాట్ సీటుపై రాంచరణ్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.
కర్టన్ రైజర్ షోగా వచ్చిన ఈ తొలి షో ఇద్దరు స్టార్ హీరోలతో అదుర్స్ అనిపించింది. రాంచరణ్ ను ఎన్టీఆర్ ‘మిస్టర్ కూల్.. సంస్కారవంతుడు’ అంటూ ఆకాశానికెత్తేశాడు.
ఇక ఒక ప్రశ్నలో భాగంగా జానీ మూవీలో పవన్ కళ్యాణ్ పాడిన పాట ఆడియో క్లిప్ వినిపించగా.. అది చరణ్ బాబాయ్ పవన్ పాడారని ఠక్కున గుర్తించి సమాధానం చెప్పాడు. ఇక తన బాబాయ్ పవన్ తో ఉన్న అనుబంధాన్ని మాటల్లో చెప్పలేనని రాంచరణ్ ఎమోషనల్ అయ్యారు.
తనను చిన్నప్పటి నుంచి చిన్నాన్నాలాగా.. ఒక ఫ్రెండ్ గా.. తండ్రి స్థానంలో ఉండి అన్ని బాబాయ్ చూసుకున్నాడంటూ రాంచరణ్ గుర్తు చేసుకున్నాడు. తమ చదువుల దగ్గర నుంచి వ్యక్తిగత విషయాల వరకు అన్నీ కళ్యాణ్ బాబాయ్ చూశాడని ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి తనతో చెప్పలేని విషయాలను కళ్యాన్ బాబాయ్ తో చెప్పించేవాడని గుర్తు చేసుకున్నాడు. ఇది విన్న ఎన్టీఆర్ వీరిద్దరి మధ్య ఇలానే బలంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఒకే మూవీని మూడేళ్లుగా తీస్తున్న రాజమౌళిపై ఎన్టీఆర్, రాంచరణ్ సెటైర్లు వేశారు. వీడియో లైవ్ లో రానా ఎంట్రీతో ముగ్గురి మధ్య జోకులు, పంచులు పేలాయి. రాజమౌళి ఘనత గురించి ఇద్దరు హీరోలు గొప్పగా చెప్పుకున్నారు.