Homeజాతీయం - అంతర్జాతీయంNational Cricket Academy: జాతీయ క్రికెట్ అకాడమీలో కార్పొరేట్ క్లాస్

National Cricket Academy: జాతీయ క్రికెట్ అకాడమీలో కార్పొరేట్ క్లాస్

రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్ సీఏ) తన కోచింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. మైదానం వెలుపలి సమస్యల పరిష్కారానికి సంబంధించి వర్ధమాన కోచ్ ల కోసం కార్పొరేట్ క్లాసులు కూడా కొత్త విధానంలో భాగం, ఇటీవలే పలువురు మాజీ ఫస్ట్ క్లాస క్రికెటర్లు బీసీసీఐ లెవెల్-2 కోచింగ్ కోర్సును హాజరయ్యారు. థియరీ, ప్రాక్టీస్ పరీక్షలు పూర్తి చేశారు. మైదానం బయటి క్రికెట్ సంబంధీకులతో వ్యవహారాల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను వాళ్లను అడిగారు. ముంబాయి మాజీ సీమర్ క్షేమల్ ఈ కోర్సు రూపకర్త. అతడు ఎంబీఏ చేశాడు. కార్పొరేట్ నేపథ్యం కూడా ఉంది. ఇలాంటి క్లాసుకు ఇంతకు ముందెప్పుడూ హాజరు కాలేదు. కానీ ఇది చాలా విలక్షణమైంది. నాకెంతో ఉపయోగపడింది అని కోర్సుకు హాజరైన ఓ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ చెప్పాడు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular