https://oktelugu.com/

Mehreen Pirzada : శృంగార సీన్ కాదు దారుణమైన రేప్ సీన్… ఎఫ్ 3 బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్

సిరీస్లో మెహ్రీన్ కొన్ని శృంగార సన్నివేశాల్లో నటించారు. ఇదే విషయం మీడియాలో రాశారు. అయితే మెహ్రీన్ దీనిపై మండిపడింది.

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2023 / 01:29 PM IST
    Follow us on

    Mehreen Pirzada : హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాద తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ సూపర్ హిట్ కాగా అమ్మడుకి తెలుగులో అవకాశాలు పెరిగాయి. మహానుభావుడు చిత్రంతో మరో హిట్ కొట్టింది. దీంతో ఆఫర్స్ క్యూ కట్టాయి. తర్వాత ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కేర్ ఆఫ్ సూర్య, జవాన్, పంతం, నోటా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే ఎఫ్ 3 చిత్రంతో కమ్ బ్యాక్ అయ్యింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

    ఆ చిత్రం తర్వాత మరలా ప్లాప్స్ పడ్డాయి. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 కూడా ఆడలేదు. దీంతో పెళ్ళికి సిద్ధమైంది. 2021లో భవ్య బిష్ణోయ్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగింది. భవ్య బిష్ణోయ్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు కావడం విశేషం. కారణంతెలియదు కానీ ఆ వివాహాన్ని ఆమె రద్దు చేసుకుంది. మరలా కెరీర్ మీద ఫోకస్ పెట్టింది.

    తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గిన నేపథ్యంలో వెబ్ సిరీస్లో నటించింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ పేరుతో తెరకెక్కిన పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ లో నటించింది. ఈ సిరీస్లో మెహ్రీన్ కొన్ని శృంగార సన్నివేశాల్లో నటించారు. ఇదే విషయం మీడియాలో రాశారు. అయితే మెహ్రీన్ దీనిపై మండిపడింది. అవి శృంగార సన్నివేశాలు కాదు. రేప్ సీన్స్. మీకు అది కూడా తెలియదా అంటూ మీడియా మీద ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

    కొన్ని సన్నివేశాల్లో ఇష్టం లేకపోయినా నటించాల్సి వస్తుంది. కథ డిమాండ్ చేసినప్పుడు తప్పదు. పెళ్లి తర్వాత జరిగిన ఓ రేప్ సీన్ ని శృంగారం సన్నివేశం అని రాశారు. మీకు బుద్ధి ఉందా? మీకు అక్కా చెల్లెళ్లు లేరా అని రెచ్చిపోయింది. మెహ్రీన్ పోస్ట్ వైరల్ గా మారింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సిరీస్ హోస్ట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. మిలన్ రుథిర దర్శకత్వం వహించగా తాహిర్ రాజ్ బాసిన్, మౌని రాయ్ కీలక రోల్స్ చేశారు.