Kirak RP chepala pulusu : ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ వ్యాపారిగా మారిన విషయం తెలిసిందే. జబర్దస్త్ మానేశాక దర్శకుడిగా మారే ప్రయత్నం చేశాడు. ఆ మూవీ మధ్యలో వివాదాలతో ఆగిపోయింది. లాభం లేదని కూకట్ పల్లి సమీపంలో రూ. 40 లక్షల పెట్టుబడి కర్రీ పాయింట్ ఏర్పాటు చేశాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో స్టాల్ తెరిచాడు. వివిధ రకాల చేపల పులుసు అందుబాటులోకి తెచ్చాడు. జనాలకు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వారి వంటలు తెగ నచ్చేశాయి.
దాంతో అనతికాలంలో వ్యాపారం అభివృద్ధి చెందింది. రూ. 40 లక్షల పెట్టుబడి నెల రోజుల్లోనే వచ్చేసిందని కిరాక్ ఆర్పీ అన్నాడు. కూకట్ పల్లి బ్రాండ్ సక్సెస్ కావడంతో నెల్లూరు వెళ్లి కొత్తగా స్టాఫ్ ని తెచ్చి వ్యాపారం వృద్ధి చేశాడు. హైదరాబాద్ శివారులో పెద్ద కిచెన్ ఏర్పాటు చేసి అక్కడ చేపల కూరలు సిద్ధం చేసి బ్రాంచ్ కి తెస్తున్నాడు.
మణికొండలో మరో బ్రాండ్ ఏర్పాటు చేశాడు. దీని ఓపెనింగ్ కి నాగబాబు గెస్ట్ వచ్చారు. కూకట్ పల్లి, మణికొండ బ్రాంచ్ లు సక్సెస్ కావడంతో కిరాక్ ఆర్పీ వ్యాపారం ఏపీకి కూడా కూడా విస్తరిస్తున్నాడు. తిరుపతిలో కొత్తగా బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నాడు. ఈ మేరకు ప్రకటన చేశాడు. నవంబర్ 19న తిరుపతిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాండ్ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే… ఓ టాప్ హీరోయిన్ తో లాంచ్ చేయిస్తున్నాడు.
హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాడా కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తిరుపతి బ్రాంచ్ రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేయనుంది. చేపల పులుసు కర్రీ పాయింట్ ఓపెనింగ్ కి ఏకంగా మెహ్రీన్ ని పిలిచాడంటే… ఏ రేంజ్ లో లాభాలు ఆర్జిస్తున్నాడో అంచనా వేయవచ్చు. జబర్దస్త్ కమెడియన్ నుండి వ్యాపారిగా మారి కిరాక్ ఆర్పీ కోట్లు సంపాదిస్తున్నాడు.