https://oktelugu.com/

ప్చ్ .. ‘బబ్లీ బ్యూటీ’కి పెళ్లి పై విరక్తి !

‘బబ్లీ బ్యూటీ మెహ్రీన్‌ కౌర్‌ ఫిర్జాదా’ హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనవుడు భవ్య బిష్ణోయ్‌ తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకొంది. నాలుగు నెలల సహజీవనం తర్వాత అతనికి బ్రేకప్ చెప్పింది మెహ్రీన్‌. పెళ్లి ముహూర్తం ఫిక్స్ కాకుండానే ఇద్దరూ విడిపోవడం వెనుక కారణాలు ఏమి ఉన్నాయా అనేది మెహ్రీన్‌ బయటపెట్టలేదు. అయితే, ఈ బ్రేకప్ వల్ల ఆమె మనసు బాగా గాయపడినట్లుంది. అందుకే, ఇక ఇప్పట్లో పెళ్లి అనే ఆలోచన చెయ్యను అని […]

Written By:
  • admin
  • , Updated On : August 3, 2021 / 09:59 AM IST
    Follow us on

    ‘బబ్లీ బ్యూటీ మెహ్రీన్‌ కౌర్‌ ఫిర్జాదా’ హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనవుడు భవ్య బిష్ణోయ్‌ తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకొంది. నాలుగు నెలల సహజీవనం తర్వాత అతనికి బ్రేకప్ చెప్పింది మెహ్రీన్‌. పెళ్లి ముహూర్తం ఫిక్స్ కాకుండానే ఇద్దరూ విడిపోవడం వెనుక కారణాలు ఏమి ఉన్నాయా అనేది మెహ్రీన్‌ బయటపెట్టలేదు. అయితే, ఈ బ్రేకప్ వల్ల ఆమె మనసు బాగా గాయపడినట్లుంది.

    అందుకే, ఇక ఇప్పట్లో పెళ్లి అనే ఆలోచన చెయ్యను అని చెప్తోంది మెహ్రీన్. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే అంటుంది. దర్శకుడు మారుతి డైరెక్షన్ లో “మంచి రోజులొచ్చాయి” అనే సినిమాలో నటించింది. అలాగే వరుణ్ తేజ్ సరసన “ఎఫ్ 3″లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ బ్యూటీ చేతిలో మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి.

    అలాగే మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయిట. మొత్తానికి పెళ్లి పెటాకులు అయ్యాక, కెరీర్ సెట్ చేసుకోవడానికి కిందామీదా పడుతుంది మెహ్రీన్‌. నిజానికి కెరీర్ సూపర్ గా వెళ్తున్న టైంలో పెళ్లి ఫిక్స్ చేసుకొని అవకాశాలను అనవసరంగా దూరం చేసుకుంది. అందుకే అంటారు, తొందరపడి లైఫ్ చేంజ్ అయ్యే నిర్ణయాలు తీసుకోవద్దు అని.

    కానీ మెహ్రీన్‌ ఆవేశ పడింది. ఆశ పడింది. ముఖ్యమంత్రి మనవడికి సతీమణి అయ్యే ఛాన్స్ ను వదులుకోకూడదు అనుకుంది. కానీ, ఆమె ఆశ ఆశగానే మిగిలిపోయింది. కాబోయే భర్తతో పెళ్ళికి ముందు వేసిన టూర్ కారణంగా అసలుకే మోసం వచ్చింది. ఆమె సానిహిత్యంలో భవ్య బిష్ణోయ్‌ అసంతృప్తి చెందాడని, అందుకే ఈ బ్యూటీని దూరం పెట్టాడని రూమర్స్ వినిపించాయి. ఇక చివరగా మెహ్రీన్‌ మరింత గ్లామరస్ గా కనిపించి ఆఫర్లను లాగేసుకోవడానికి తెగ తాపత్రయ పడుతుంది.