Mega Family: మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంత మండి హీరోలుగా వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. ఈ తరుణంలోనే చిరంజీవి చిన్న కూతురు భర్త కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. “విజేత” సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ మోవిఎతో విజేత కాలేదనే చెప్పాలి. ఆ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర అలరించలేకపోయింది. ఈ తరుణంలోనే కళ్యాణ్ ఆ తర్వాత ఇప్పటి వరకు వేరే సినిమా చేయలేదు. అయితే తాజాగా వరుస సినిమాలతో తన సత్తా చాటెందుకు రెడీ అవుతున్నాడు.
ఈ క్రమంలో తాజాగా కళ్యాణ్ నటిస్తున్న సూపర్ మచ్చి సినిమా నుంచి ఓ అప్డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది. టీజర్ లో కాయన్ దేవ్ నటనలో మెరుగుపడ్డట్టు కనబడుతున్నాడు. మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ చూస్తుంటే మూవీ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్లు తెలుస్తుంది. దీపావళి కానుకగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు నిర్మాతలు. సూపర్ మచ్చి చిత్రానికి పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగుతమ్ అందిస్తున్నారు.
ఈ సినిమాలో రచితా రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. అలానే రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రగతి, అజయ్, పోసాని కృష్ణమురళి, ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా మంచి వ్యూస్ సంపాదిస్తుంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Megastar son in law kalyan dev super machi movie teaser released
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com