Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరో రెండేళ్ల తర్వాత ఇక సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నారు. అందుకే, సాధ్యమైనంత త్వరగా ఈ లోపే ఎక్కువ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరుసపెట్టి సినిమాలను ప్రకటిస్తున్నారు. అంతే స్పీడ్ గా ప్రకటించిన సినిమాల షూట్ ను కూడా స్టార్ట్ చేసి.. తక్కువ షెడ్యూల్స్ లోనే షూట్ ను ఫినిష్ చేస్తున్నారు.

దానికి తగ్గట్టుగానే మెగాస్టార్(Megastar Chiranjeevi) షూటింగ్ పార్ట్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. కారణం.. డూప్. అవును.. క్లోజ్ షాట్స్ లోనే మెగాస్టార్ నటిస్తారు. ఇక మిగిలిన లాంగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ లో డూప్ నటిస్తారు. పైగా ఒక్కో సినిమాకు ఒక్కో డూప్ ను పెట్టుకున్నారు. ప్రస్తుతం చిరు చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కాబట్టి ముగ్గురు డూప్ లను ఆయన ఇప్పటికే నియమించుకున్నారు.
ఇప్పుడు మరో సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి.. మెగాస్టార్ కి మరో డూప్ కావాలి. ప్రస్తుతం మెగా మేనేజర్లు, పీర్వోలు ఈ డూప్ ను వెతికే పనిలోనే పడ్డారు. చిరుకి అందరూ సూట్ కారు. ఎక్కువ సీన్స్ లో చీట్ చేయాలి కాబట్టి.. చిరు బాడీకి, హిట్ కి, వెయిట్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. అందుకే పర్ఫెక్ట్ డూప్ ను సెర్చ్ చేస్తున్నారు.
మొత్తానికి ఒక్కో సినిమాను చకచకా పూర్తి చేసుకుంటూ పోతున్న చిరంజీవి, వచ్చే ఏడాదిలో ఏకంగా 3 సినిమాలను రిలీజ్ చేయబోతున్నాడు. ముందుగా “ఆచార్య” ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత సమ్మర్ లో “గాడ్ ఫాదర్” రిలీజ్ అవుతుంది. అలాగే “భోళాశంకర్” కూడా వచ్చే దసరాకి రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.
మొత్తమ్మీద చిరు ఒకే ఏడాది మూడు సినిమాలను రిలీజ్ చేయబోతున్నాడు. మెగా ఫ్యాన్స్ కి ఇది సంతోషాన్ని ఇచ్చే అంశమే గానీ, మిగతా హీరోల సినిమాలకు మాత్రం ఇది ఇబ్బందికరమే.
Also Read: మెగాస్టార్‌తో స్టెప్పులేయనున్న సల్మాన్ భాయ్