Muthamestri : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన 50 సంవత్సరాల నుంచి సేవలను అందిస్తూనే వస్తున్నారు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. మరి ఈ క్రమంలోనే చిరంజీవి లాంటి స్టార్ హీరో సైతం అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి డాన్సులతో, ఫైట్లతో వైవిధ్యభరితమైన కథంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు. ముఖ్యంగా ఆయన మాస్ లో మంచి ఇమేజ్ ను సంపాదించుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మాస్ ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ఆయన సినిమాలు ఉండటమే అంటూ చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే కోదండరామిరెడ్డి(Kondanda Ramireddy) చిరంజీవి కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వీళ్ళ కాంబినేషన్ లో దాదాపు 22 సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా చిరంజీవి ని మెగాస్టార్ గా నిలపడంలో కోదండరామిరెడ్డి తీవ్రమైన కృషి చేశారనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘ ముఠా మేస్త్రి ‘
(Muta meshtri) సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందింది. నిజానికి ఈ సినిమాలో చిరంజీవి యాక్టింగ్ గాని, డాన్సులు గాని యావత్ ప్రేక్షక లోకం మొత్తాన్ని అలరిస్తూ ఉంటాయి.
అలాగే ఈ సినిమాలో రోజా మీనా హీరోయిన్గా నటించారు వీళ్ళ క్యారెక్టర్లు కూడా ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా ఉంటాయి.అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ ని కోటి అందించాడు. ఈ సినిమాలో సాంగ్స్ మొత్తం ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉండటమే కాకుండా ఇప్పుడు విన్నా కూడా ఆ సాంగ్స్ చాలా బాగుంటాయి.
ముఖ్యంగా ముఠామేస్త్రి అనే టైటిల్ సాంగ్ అయితే చాలా పాపులారిటి ని సంపాదించుకుంది. ఇక ఇప్పటికి కొన్ని సినిమా వేడుకల్లో ఈ సాంగ్ ను ప్లే చేస్తూ చాలా మంది డాన్స్ కూడా చేస్తూ ఉంటారు. అంతటి ఘన కీర్తిని సంపాదించుకున్న ముఠామేస్త్రి సినిమా రిలీజ్ అయి నేటికి 32 సంవత్సరాలు పూర్తవుతుంది.
1993 జనవరి 17వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా నేటితో 32 సంవత్సరాలను పూర్తి చేసుకున్నప్పటికి మనం ఆ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే ఆ సినిమా ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చిరంజీవి మేనియా తో వచ్చి మంచి విజయాన్ని సాధించి ముందుకు సాగిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటనే చెప్పాలి…