Chiranjeevi- Pawan Kalyan: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి తన స్వయం కృషి తో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగాస్టార్ గా చిరంజీవి సాధించిన విజయాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో సువర్ణక్షరాలతో లిఖించబడినది.. చిరంజీవి అంటే తెలుగు సినిమా..తెలుగు సినిమా అంటే చిరంజీవి అనే రేంజ్ లో ఆయన తన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.. అలా కొట్లాడి మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి కి రాజకీయాలు పెద్దగా అచ్చి రాలేదు..ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి 2009 వ సర్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి 18 సీట్లు,78 లక్షల ఓట్లు మరియు 18 శాతం ఓటు బ్యాంకు వచ్చింది.

ఒక కొత్త పార్టీ కి దశాబ్దాలుగా రాష్ట్రము లో ఆధిపత్యం చూపిస్తున్న రెండు బలమైన పార్టీలకు ఎదిరించి అంత ఓటు బ్యాంకు ని సాధించడం అంటే మాములు విషయం కాదు.. కానీ పార్టీ లో ఉన్న ముఖ్య నేతల ఒత్తిడి కారణం గా కాంగ్రెస్ పారీ లో విలీనం చేసి, కొంత కాలం యాక్టివ్ పాలిటిక్స్ చేసి ఆ తర్వాత ఆయన శాశ్వతం గా తప్పుకున్నారు..2017 వ సంవత్సరం లో ఖైదీ నెంబర్ 150 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ అప్పటి నుండి సినిమాల్లో కొనసాగుతూ వస్తున్నాడు.
అయితే తన రాజకీయ ప్రస్థానం గురించి పెద్దగా ఎప్పుడు మాట్లాడని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల పాలు సందర్భాలలో తన రాజకీయ ప్రస్థానం గురించి కామెంట్స్ చేసాడు.. నిన్న తన కాలేజీ స్నేహితుల రీ యూనియన్ ఫంక్షన్ కి చిరంజీవి ‘శ్రీ ఎర్రమిల్లి నారాయణ మూర్తి ‘ కాలేజీ లో ఏర్పాటు చేసిన ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా గా హాజరయ్యాడు.. ఈ ఫంక్షన్ లో తన కాలేజీ డేస్ ని గుర్తు చేసుకుంటూ మాట్లాడిన చిరంజీవి.. ఆ తర్వాత తన రాజకీయ కెరీర్ గురుంచి కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు.

ఆయన మాట్లాడుతూ ‘రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం..దానికి మనం సున్నితంగా ఉండకూడదు..అక్కడ బాగా మోరటుతేలాలి,రాటుతేలాలి,
ప్రత్యార్థులను మాటలు అనాలి, వాళ్ళ చేత అనిపించుకోవాలి.. అవసరమా ఇది..వీటి అన్నిటికి నా తమ్ముడు తగినవాడు.. తను అంటాడు అనిపించుకుంటాడు..అలాంటి వాళ్లకి మీ ఆధారాభిమానాలు ఉన్నాయి..అందరి సహాయాసహకారకాలతో మరియు ఆశీస్సులతో ఎదో ఒక రోజు కచ్చితంగా ఉన్నంత పదవి లో అతనిని మనం చూస్తాము’ అంటూ మెగాస్టార్ పవన్ కళ్యాణ్ కి మద్దత్తు గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
[…] […]