https://oktelugu.com/

Megastar Chiranjeevi : నా సంపాదన అంతంత మాత్రమే..మొక్కల్ని కొనుగోలు చేసే స్థితిలో లేను అంటూ మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్!

గత కొంతకాలం క్రితం నేను హైదరాబాద్ లో కొత్త ఇల్లు కట్టుకుంటున్నానని తెలిసి రాందేవ్ నాకు కొన్ని మొక్కలను ఇచ్చాడు. రాందేవ్ ఇచ్చిన ఆ మొక్కలు నేను విదేశాలకు వెళ్ళినప్పుడు చూస్తూండేవాడిని. అలాంటి అరుదైన మొక్కలు ఇక్కడ నాకు తెచ్చి ఇవ్వడంతో ఎంతో సంతోషించాను. మా ఇంట్లో నేను కూర్చునే ప్రదేశం లో బయటకి కనిపించకుండా ఈ మొక్కలను ఫెన్సింగ్ లాగా చేసి ఇవ్వమంటే రామ్ దేవ్ చాలా అద్భుతంగా డిజైన్ చేసిచ్చాడు'.

Written By:
  • Vicky
  • , Updated On : January 28, 2025 / 09:15 PM IST
    Megastar Chiranjeevi

    Megastar Chiranjeevi

    Follow us on

    Megastar Chiranjeevi : నేడు రంగారెడ్డి జిల్లాలోని ప్రొద్దుటూరు ప్రాంతంలో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్సిపీరియం పార్కుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ఈ ప్రదేశం మీ అందరికంటే ముందు నాకు బాగా తెలుసు. గత కొంతకాలం క్రితం నేను హైదరాబాద్ లో కొత్త ఇల్లు కట్టుకుంటున్నానని తెలిసి రాందేవ్ నాకు కొన్ని మొక్కలను ఇచ్చాడు. రాందేవ్ ఇచ్చిన ఆ మొక్కలు నేను విదేశాలకు వెళ్ళినప్పుడు చూస్తూండేవాడిని. అలాంటి అరుదైన మొక్కలు ఇక్కడ నాకు తెచ్చి ఇవ్వడంతో ఎంతో సంతోషించాను. మా ఇంట్లో నేను కూర్చునే ప్రదేశం లో బయటకి కనిపించకుండా ఈ మొక్కలను ఫెన్సింగ్ లాగా చేసి ఇవ్వమంటే రామ్ దేవ్ చాలా అద్భుతంగా డిజైన్ చేసిచ్చాడు’.

    ‘అలా మా ఇంటి చుట్టూ అద్భుతమైన మొక్కలను పెంచుకున్నాను. రాందేవ్ నాకు ఒక వ్యాపారవేత్తలాగా ఎప్పుడూ కనిపించడు. ఒక కళాకారుడిగా మాత్రమే కనిపిస్తాడు. అందుకే నా మనసుకి అతను చాలా దగ్గరయ్యాడు. అతన్ని కలిసినప్పుడల్లా ‘కొత్తగా మొక్కలు వచ్చాయి..వచ్చి చూస్తారా’ అని అడిగేవాడు. వాటిని చూస్తే మొత్తం కొనయాలని అనిపిస్తుంది. ఒకప్పుడు వాటి ధర వేలు, లక్షల్లో ఉండేవి. ఇప్పుడు కోట్లలో ఉంటుంది. వాటిని కొనడానికి నేను సంపాదించే సంపాదన అసలు సరిపోదేమో(నవ్వుతూ’). నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఇవన్నీ చూస్తుంటే మనసుకి ఎంతో ఆహ్లాదం కలిగింది’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఇలాంటివి పెట్టాలంటే కేవలం వ్యాపార దృక్పధం ఉంటే సరిపోదు. కళ మీద ఇష్టం, ప్రేమ ఉండాలి. రాందేవ్ గత పాతికేళ్లుగా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ, విదేశాల్లో మాత్రమే దొరికే కొన్ని మొక్కలను కూడా ఇక్కడికి తీసుకొచ్చాడు’.

    ‘ఎక్సిపీరియమ్ లోని ఇలాంటి శిలాకృతులు హైదరాబాద్ కి కొత్త అందాన్ని తీసుకొస్తుందని బలమైన నమ్మకం నాకుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఈవెంట్ మొత్తం లో చిరంజీవి, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం హైలైట్ గా మారింది. అడుగడుగునా ఆయన మెగాస్టార్ చిరంజీవి కి ఇచ్చిన గౌరవాన్ని చూసి అభిమానులు ఎంతో సంతోషించారు. స్టేజి మీద ఉన్నప్పుడు చిరంజీవి కి మంచి నీళ్లు తాగేందుకు అవసరామిటే స్వయంగా రేవంత్ రెడ్డి బాటిల్ మూత ని ఓపెన్ చేసి చిరంజీవి తన చేతుల మీదుగా మంచి నీళ్ల బాటిల్ ని అందించాడు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పదవులను అలకరించాల్సిన అవసరం లేదు, చిరంజీవి స్థాయి ముఖ్యమంత్రిని మించిన హోదా, ఇదంతా ఆయన నాలుగు దశాబ్దాలుగా పెంచుకున్న గౌరవం కారణంగా దక్కింది అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా లో గర్వంగా చెప్పుకుంటున్నారు.