
Rakhi With Bhola Shankar : టాలెంటెడ్ దర్శకుడు మెహర్ రమేష్ – మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కలయికలో రాబోతున్న ‘వేదాళం’ రీమేక్ కి ‘భోళా శంకర్’ (Bholaa Shankar) అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. రాఖీ పండగ సందర్భంగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందించింది చిత్రబృందం. ఈ సినిమా చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేశ్ నటించబోతుందని మేము గతంలోనే రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, మెగాస్టార్ కు కీర్తి సురేష్ రాఖీ కడుతున్న వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
‘చెల్లెళ్లందరి రక్షాబంధం.. అభిమానులందరి ఆత్మబంధం.. మనందరి అన్నయ్య జన్మదినం’ అంటూ కీర్తి సురేష్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. మరి మెగాస్టార్ కి చెల్లెలిగా ‘మహానటి’ కీర్తి సురేశ్ ఎలా నటిస్తోందో చూడాలి. మొత్తానికి రాఖీ పండగకి చిరంజీవికి కీర్తి సురేశ్ అభిమానులకు మంచి సర్ ప్రైజ్ ఇచ్చింది.
ఇక ఈ సినిమాలో అద్భుతమైన సిస్టర్ సెంటిమెంట్ ను ఉందట. మెహర్ రమేష్ స్క్రిప్ట్ లో సిస్టర్ రోల్ కి సంబందించిన ట్రాక్ ను చాలా గొప్పగా రాశాడని.. ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప సిస్టర్ సెంటిమెంట్ సినిమా రాలేదు అని మేకర్స్ చెబుతున్నారు. మెగాస్టార్ కి కూడా సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చిందట.
ఏది ఏమైనా మెహర్ రమేష్ కథలోని మెయిన్ ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసే విధంగా పక్కాగా సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి తనకు ఇక డైరెక్షన్ ఛాన్స్ రావడం కష్టమే అనుకుంటున్న సమయంలో మెగాస్టార్ పెద్ద మనసుతో పిలిచి మరీ మెహర్ రమేష్ ఈ గొప్ప అవకాశం ఇచ్చారు. అందుకే మెహర్ రమేష్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.
అన్నట్టు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా ఇది. ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన తాజా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.