https://oktelugu.com/

Chiranjeevi: ANR ఛీ కొట్టి రిజెక్ట్ చేసిన పాటని రీమిక్స్ చేసి బ్లాక్ బస్టర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..ఆ పాట ఏంటో తెలుసా?

ఆరోజుల్లో ఈ పాట సృష్టించిన సునామిని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా?, శ్రీదేవి అందాలు, మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన డ్యాన్స్ ఈ పాటకు ప్రత్యేక అందాన్ని తీసుకొస్తే, వేటూరి రాసిన లిరిక్స్, ఇళయరాజా అందించిన బాణీలు ఆ పాటని దశాబ్దాల పాటు మారుమోగిపోయేలా చేసాయి.

Written By: , Updated On : February 9, 2025 / 05:09 PM IST
Chiranjeevi (1)

Chiranjeevi (1)

Follow us on

Chiranjeevi: మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాని మరో హీరో చేయడం, ఆ సినిమా హిట్ లేదా ఫ్లాప్ అవ్వడం వంటివి ఎంతో కాలం నుండి చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్, నాగేశ్వరరావు,కృష్ణ,శోభన్ బాబు కాలం నుండి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ కాలం వరకు ఇవి జరుగుతూనే ఉన్నాయి. కేవలం సినిమాలు మాత్రమే కాదు, కొన్ని పాటలు కూడా అలా ఒక హీరో రిజెక్ట్ చేసినవి మరో హీరో ఒప్పుకొని చేయడం వంటి సంఘటనలు జరిగాయట. అలా దిగ్గజ రచయితా వేటూరి రాసిన ఒక పాట నాగేశ్వర రావు కి నచ్చలేదు, కానీ అదే పాటని కొన్నేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాకి వాడితే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. దశాబ్దాల నుండి ఆ పాట సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. ఆ పాట మరేదో కాదు ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లోని ‘అబ్బనీ తీయని దెబ్బ’ పాట.

ఆరోజుల్లో ఈ పాట సృష్టించిన సునామిని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా?, శ్రీదేవి అందాలు, మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన డ్యాన్స్ ఈ పాటకు ప్రత్యేక అందాన్ని తీసుకొస్తే, వేటూరి రాసిన లిరిక్స్, ఇళయరాజా అందించిన బాణీలు ఆ పాటని దశాబ్దాల పాటు మారుమోగిపోయేలా చేసాయి. ఈ పాటని నాగేశ్వర రావు గారు రిజెక్ట్ చేయడానికి ప్రధాన కారణం, ఆ పాటలో అసభ్య పదాలు ఉన్నాయని. ఈ విషయాన్నీ స్వయంగా నాగేశ్వరరావు గారి పెద్ద కుమారుడు వెంకట్ ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. ఆయన రిజెక్ట్ చేసిన తర్వాత వేటూరి గారు ఆ పాటకు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇళయరాజా కి అందించాడట. అలా ఈ చార్ట్ బస్టర్ సాంగ్ రూపుదిద్దుకుంది. ఈ సినిమాని ఆ రోజుల్లో జనాలు ఎగబడి రిపీట్స్ లో చూడడానికి ఈ పాట కూడా ఒక ప్రధాన కారణమైంది అనడంలో ఎలాంటి అతిశయోక్తికి లేదు.

అప్పట్లో సందర్భానికి తగ్గట్టు లిరిక్స్ అసభ్యంగా ఉండే పరిస్థితులు వచ్చినా హీరోలు ఒప్పుకునేవారు కాదట. కానీ నేటి తరంలో ఎలాంటి లిరికల్ సాంగ్స్ వస్తున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లలు ఆ పాటలను విని చెడిపోయే స్థితికి వచ్చేసారు. యూత్ ఆడియన్స్ వాటిని నచ్చొచ్చు కానీ, అప్పటి పాటల్లో మాధుర్యాన్ని ఆస్వాదించిన పెద్దలు మాత్రం అసహ్యించుకునే పరిస్థితులు వచ్చాయి. ఆ పాటలకు ఇప్పుడు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా మద్యలమాలలో వందల మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఆడియన్స్ అభిరుచులలో గతంతో పోలిస్తే ఎంత వ్యత్యాసం వచ్చిందో మీరే గమనించండి. అప్పట్లో ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన సాహిత్యకారులు,ఇప్పుడు ఆడియన్స్ కి తగ్గట్టుగా తమని తాము మార్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. కొంతమంది అలా మారలేక సినీ పరిశ్రమ ని వదిలి వెళ్లిపోతున్నారు.