Chiranjeevi With Child: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?, చూసేందుకు ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ బుడ్డోడు, ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఇతగాడికి ఒక సూపర్ స్టార్ కి ఉన్నంత క్రేజ్ ఉంది. ఎప్పుడు ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతాడో తెలియదు కానీ, అడుగుపెట్టిన రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అవుతుంది. ఆ రేంజ్ అందం, కటౌట్ ఇతని సొంతం. సోషల్ మీడియా కి ఇతను దూరం గానే ఉంటాడు కానీ, ఈయనకు సంబంధించి ఏ చిన్న ఫోటో విడుదలైన ఆరోజు మొత్తం అందరూ ఇతని గురించే మాట్లాడుకుంటారు. సంగీతం లో గొప్ప ప్రావిణ్యం ఉన్నవాడు, మార్షల్ ఆర్ట్స్ లో అదరగొట్టేస్తాడు, వీటికి సంబంధించి ఆయనవి ఇప్పటికే సోషల్ మీడియా లో చాలా వీడియోలు విడుదల అయ్యాయి. ఆయన మరెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తనయుడు అకిరా నందన్(Akira Nandan).
Also Read: బాలీవుడ్ లో తగ్గని ‘పుష్ప’ మేనియా.. ఈ వీడియోనే ఫ్రూఫ్
పవన్ కళ్యాణ్ వీరాభిమానులు ఆ ఫోటోని చూడగానే ఎవరో చాలా తేలికగా గుర్తు పట్టగలరు. కానీ సాధారణ మూవీ లవర్స్ కి ఇతన్ని కనిపెట్టడం కాస్త కష్టమే. చిన్న తనం లో పవన్ కళ్యాణ్ కూడా అచ్చు గుద్దినట్టుగా ఇవే పోలికలతో ఉండేవాడు. ప్రస్తుతం నటన లో శిక్షణ తీసుకుంటున్న అకిరా నందన్, అతి త్వరలోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నాడు అని చాలా కాలం నుండి ఒక వార్త వినిపిస్తుంది. ఈ వార్త వినపడినప్పుడల్లా అకిరా నందన్ తల్లి రేణు దేశాయ్ అందులో ఎలాంటి నిజం లేదని, అకిరా ఇంకా సినిమాల్లోకి రావాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇస్తూ వచ్చేది. కానీ సైలెంట్ గా మాత్రం అకిరా లాంచింగ్ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు చకచకా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ తన క్రేజ్ ని కేవలం టాలీవుడ్ కి మాత్రమే ప్రస్తుతానికి పరిమితం చేసాడు.
Also Read: పవన్ ను తిడితే అన్నం తినకుండా ఏడ్చేదాన్ని? ఇంత ప్రేమేంటి పాప…
రీసెంట్ గా విడుదలైన ‘హరి హర వీరమల్లు’ చిత్రం హిందీ వెర్షన్ ఇంకా రెడీ అవ్వలేదు. వచ్చే వారం విడుదల కాబోతుంది. అప్పుడు హిందీ ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి రెస్పాన్స్ వస్తుందా?, పవన్ కళ్యాణ్ కి హిందీ లో మార్కెట్ ఏర్పడుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం కానీ, అకిరా నందన్ మాత్రం మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో తన జెండా ని పాథేన్తా సత్తా ఉంది. కావాల్సినదంతా, ఒక మంచి స్క్రిప్ట్, అకిరా నందన్ లో నటన. ఈ రెండు ఉంటే మాత్రం టాలీవుడ్ లో ఆయన్ని మరో ప్రభాస్ గా చూడవచ్చు. 2027 వ సంవత్సరం లో అకిరా నందన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈయన కూడా తన తండ్రి లాగానే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు ని క్రియేట్ చేసుకొని భారీ ఫ్యాన్ బేస్ ని సంపాదిస్తాడా లేదా అనేది.
Konidela Akira Nandan Desai pic.twitter.com/2SGgxfratD
— ✰ᴼᴳ (@Ustaad_Kalyan18) February 12, 2025