Megastar Chiranjeevi: గత కొద్ది రోజుల నుండి మెగాస్టార్ చిరంజీవి OTT లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవల కాలం లో OTT ని చూసే ఆడియన్స్ సంఖ్యా బాగా పెరిగిపోవడం తో వారిని ఆకట్టుకొని తమ సంస్థలను మరింత అభివృద్ధి చెయ్యడం కోసం OTT నిర్వాహకులు సరికొత్త ప్లాన్స్ తో మన ముందుకి వస్తున్నారు..ముఖ్యంగా స్టార్ హీరోస్ తో వెబ్ సిరీస్ మరియు టాక్ షోస్ వంటివి నిర్వహించి మంచి వ్యూయర్ షిప్ ని దక్కించుకుంటున్నారు..ఈ ఏడాది నందమూరి బాలకృష్ణ తో అన్ స్టాపబుల్ విత్ NBK ప్రోగ్రాం ఆహా మీడియా లో ప్రసారం అయ్యి ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..బాలకృష్ణ ని వ్యాఖ్యాతగా మనం ఇంతకు ముందు కలలో కూడా ఊహించి ఉండము..కానీ అసాధ్యం అనుకున్న ఆ పనిని ఆహా వారు సుసాధ్యం చేసి గ్రాండ్ సక్సెస్ ని అందుకున్నారు..ఇప్పుడు మెగాస్టార్ తో కూడా డిజిటల్ ఎంట్రీ చేయించి ఆడియన్స్ కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించడానికి సిద్ధమైంది ఒక ప్రముఖ OTT సంస్థ.

ఇటీవలే చిరంజీవి ని కలిసి ఈ విషయం పై చర్చించిన ఆ ప్రముఖ OTT సంస్థ నిర్వాహకులు త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియచెయ్యబోతున్నట్టు సమాచారం..అయితే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం చిరంజీవి తో ఆ OTT సంస్థ వారు టాక్ షో ని నిర్వహించడానికి కాదంట కలిసింది.
Also Read: Pushpa 2: ‘పుష్ప 1’ కంటే ‘పుష్ప 2’లో సుకుమార్ సంచలన మార్పులు
ఆయనతో ఒక వెబ్ సిరీస్ ని నిర్మించడానికట..ఈ విషయం పై మెగా అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నారు..OTT లో టాక్ షోస్ నిర్వహించడం వరుకు పర్వాలేదు కానీ..మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో వెబ్ సిరీస్ వంటివి చెయ్యడం సరికాదని..తమిళ హీరో సూర్య కూడా ఇలా వరుసగా రెండు సినిమాలు నేరుగా OTT కి ఇవ్వడం వల్ల ఆయన మార్కెట్ కి బాగా దెబ్బ పడిందని..అలాగే తెలుగు లో కూడా హీరో నాని తన మార్కెట్ కి చిల్లు పెట్టుకున్నాడని..ఇప్పుడు చిరంజీవి గారు కూడా అలా చెయ్యడం సరికాదని..మెగాస్టార్ అంటే వెండితెర మీద ఒక సెలబ్రేషన్ అని..ఎప్పుడూ అలానే ఉండాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో చిరంజీవి ని టాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు..మరి దీనికి చిరంజీవి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలిమరి.

Also Read:Prabhas – NTR: ప్రభాస్ – ఎన్టీఆర్ మల్టీస్టారెర్ కి ముహూర్తం ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
[…] […]