Megastar Chiranjeevi: మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత, 7 పదుల వయస్సు లో కూడా ఇప్పటికీ సినిమాల్లో హీరో గా చేస్తూ, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొడుతున్న మరో హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). ఆయన రీ ఎంట్రీ నే ఒక ప్రభంజనం. ఈ వయస్సులో చిరంజీవి ని ఎవరు చూస్తారులే, రీ ఎంట్రీ ఇచ్చినా ఉపయోగం ఉండదు అని అప్పట్లో ఆయనపై కామెంట్స్ విసిరేవారు. కానీ ‘ఖైదీ నెంబర్ 150’ తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి, బాహుబలి తర్వాత 100 కోట్ల షేర్ ని కొల్లగొట్టిన మొట్టమొదటి హీరో గా సరికొత్త చరిత్ర సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా తర్వాత విడుదలైన సైరా నరసింహా రెడ్డి చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చి, మెగాస్టార్ కెరీర్ లో మొట్టమొదటి 200 కోట్ల గ్రాసర్ గా నిల్చింది.
ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది, ఆ తర్వాత వచ్చిన ‘గాడ్ ఫాదర్’ కూడా యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో రెండవ 200 కోట్ల గ్రాసర్ గా నిల్చింది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఆదివారం తో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోబోతుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి అరుదైన రికార్డు ని నెలకొల్పిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరో గా సరికొత్త రికార్డు ని నెలకొల్పాడు. అదేమిటంటే ప్రాంతీయ బాషా చిత్రాలతో రెండు సార్లు 200 కోట్ల గ్రాస్ (మొదటి సినిమా వాల్తేరు వీరయ్య) ని అందుకున్న ఏకైక హీరో గా చిరంజీవి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఈ రికార్డు నేటి తరం స్టార్ హీరోలకు కూడా లేదు. అల్లు అర్జున్ కి ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం ద్వారా రీజినల్ క్యాటగిరీ లో 200 కోట్ల గ్రాస్ సినిమా ఉంది. ప్రభాస్ కి ఒక్క సినిమా కూడా లేదు. ఇక పవన్ కళ్యాణ్ కి ‘ఓజీ’ ద్వారా రీజనల్ మూవీస్ క్యాటగిరీలో 200 కోట్ల గ్రాస్ సినిమా ఉంది. అదే విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి కూడా రంగస్థలం ద్వారా ఈ క్యాటగిరీ లో 200 కోట్ల గ్రాస్ సినిమా ఉంది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్, మహేష్ బాబు లకు కూడా ఈ రికార్డు లేదు. ఒక్క మెగాస్టార్ చిరంజీవి కి మాత్రమే రీజనల్ సినిమాల్లో రెండు 200 కోట్ల గ్రాస్ సినిమాలు ఉన్నట్లుగా చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.