ఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi: మరో సంచలన రికార్డు ని నమోదు చేసిన మెగాస్టార్..అల్లు అర్జున్, ప్రభాస్ లకు...

Megastar Chiranjeevi: మరో సంచలన రికార్డు ని నమోదు చేసిన మెగాస్టార్..అల్లు అర్జున్, ప్రభాస్ లకు కూడా కష్టమే!

Megastar Chiranjeevi: మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత, 7 పదుల వయస్సు లో కూడా ఇప్పటికీ సినిమాల్లో హీరో గా చేస్తూ, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొడుతున్న మరో హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). ఆయన రీ ఎంట్రీ నే ఒక ప్రభంజనం. ఈ వయస్సులో చిరంజీవి ని ఎవరు చూస్తారులే, రీ ఎంట్రీ ఇచ్చినా ఉపయోగం ఉండదు అని అప్పట్లో ఆయనపై కామెంట్స్ విసిరేవారు. కానీ ‘ఖైదీ నెంబర్ 150’ తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి, బాహుబలి తర్వాత 100 కోట్ల షేర్ ని కొల్లగొట్టిన మొట్టమొదటి హీరో గా సరికొత్త చరిత్ర సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా తర్వాత విడుదలైన సైరా నరసింహా రెడ్డి చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చి, మెగాస్టార్ కెరీర్ లో మొట్టమొదటి 200 కోట్ల గ్రాసర్ గా నిల్చింది.

ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది, ఆ తర్వాత వచ్చిన ‘గాడ్ ఫాదర్’ కూడా యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో రెండవ 200 కోట్ల గ్రాసర్ గా నిల్చింది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఆదివారం తో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోబోతుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి అరుదైన రికార్డు ని నెలకొల్పిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరో గా సరికొత్త రికార్డు ని నెలకొల్పాడు. అదేమిటంటే ప్రాంతీయ బాషా చిత్రాలతో రెండు సార్లు 200 కోట్ల గ్రాస్ (మొదటి సినిమా వాల్తేరు వీరయ్య) ని అందుకున్న ఏకైక హీరో గా చిరంజీవి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఈ రికార్డు నేటి తరం స్టార్ హీరోలకు కూడా లేదు. అల్లు అర్జున్ కి ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం ద్వారా రీజినల్ క్యాటగిరీ లో 200 కోట్ల గ్రాస్ సినిమా ఉంది. ప్రభాస్ కి ఒక్క సినిమా కూడా లేదు. ఇక పవన్ కళ్యాణ్ కి ‘ఓజీ’ ద్వారా రీజనల్ మూవీస్ క్యాటగిరీలో 200 కోట్ల గ్రాస్ సినిమా ఉంది. అదే విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి కూడా రంగస్థలం ద్వారా ఈ క్యాటగిరీ లో 200 కోట్ల గ్రాస్ సినిమా ఉంది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్, మహేష్ బాబు లకు కూడా ఈ రికార్డు లేదు. ఒక్క మెగాస్టార్ చిరంజీవి కి మాత్రమే రీజనల్ సినిమాల్లో రెండు 200 కోట్ల గ్రాస్ సినిమాలు ఉన్నట్లుగా చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Chiranjeevi: చిరంజీవి లైనప్ లో భారీ మార్పులు చేశారు కదా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. అలాంటి గొప్ప నటుడు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో...

Chiranjeevi And Balakrishna: చిరంజీవి, బాలయ్య లను చూసి యంగ్ హీరోలు నేర్చుకోవాలి…

Chiranjeevi And Balakrishna: సినిమా ఇండస్ట్రీలో నటులుగా రాణిస్తున్న ప్రతి ఒక్కరు ఎంతో క్రమశిక్షణతో మెదలాలి. ప్రతి ఒక్కరితో కలుపుగోలుతనంతో ఉంటేనే వాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అలాగే...

Most Popular

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...
Exit mobile version