Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నారనే చెప్పాలి. ఇప్పటికే ఆచార్య, గాడ్‌ఫాదర్, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తూ.. షూటింగ్స్‌లో నిమగ్నమయ్యారు చిరు. కాగా నిన్ననే బాబీ దర్శకత్వంలో చేస్తున్నతన 154 వ సినిమా షూటింగ్‌కు పూజా కార్యక్రమాలు చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు చిరు. ఇందులో ఆయన తనయుడు, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా కనిపించున్నారు. ఇటీవలే విడుదలైన పోస్టర్, ప్రోమోలు, సాంగ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. కాగా గాడ్‌ఫాదర్, భోళా శంకర్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయనున్నారు అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

గతంలో పలుమార్లు వీరి కాంబోలో మూవీ రాబోతుందని వర్తులు కూడా వచ్చాయి. కాగా ఇప్పుడు అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కాగా త్రివిక్రమ్, మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు డివివి ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణం వహించనుందని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. అలానే దర్శకుడు మారుతి కూడా ఇటీవల చిరంజీవి గారిని కలిసి ఓ లైన్ చెప్పానని… ఆయనకు బాగా నచ్చిందని అన్నారు. ఇప్పుడు దాన్ని డెవలప్ చేసే పనిలో పడ్డానని, తన మార్క్ కామెడీతో పాటు, చిరు ఫ్యాన్స్ ఆశించే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయన్నారు.