Godfather Closing Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆచార్య వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత వచ్చిన సినిమా కావడం తో ఈ చిత్రాన్ని ఎక్కువ రేట్లకు అమ్మకుండా, దాదాపుగా అన్ని ప్రాంతాలలో సొంతగానే విడుదల చెయ్యడానికి మొగ్గు చూపారు నిర్మాతలు..అందుకే గాడ్ ఫాదర్ విడుదల రోజు రెండు మూడు సినిమాలు క్లాష్ కి వచ్చినా కూడా విడుదల చెయ్యడానికి సిద్ధపడ్డారు..ఈసారి రికార్డ్స్ మీద అసలు ఏ మాత్రం ఫోకస్ చెయ్యలేదు..అందుకే దొరికిన థియేటర్స్ లోనే విడుదల చేసుకొని డీసెంట్ స్థాయి వసూళ్లతోనే తృప్తి చెందారు నిర్మాతలు..ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకొని నాల్గవ వారం లోకి అడుగు పెట్టిన ఈ సినిమా,కొత్త సినిమాల రాకతో బిజినెస్ క్లోజ్ కి వచ్చేసింది..ప్రాంతాలవారీగా ఈ సినిమా క్లోసింగ్ కలెక్షన్స్ ఎంత ఉందొ ఒక్కసారి విశ్లేషిద్దాం.

ప్రాంతం షేర్ కలెక్షన్స్
నైజం 13 కోట్లు
సీడెడ్ 10 కోట్లు
ఉత్తరాంధ్ర 7.25 కోట్లు
ఈస్ట్ 4.00 కోట్లు
వెస్ట్ 2.50 కోట్లు
నెల్లూరు 2.80 కోట్లు
గుంటూరు 4.40 కోట్లు
కృష్ణ 3.80 కోట్లు
మొత్తం 47.75 కోట్లు
ఓవర్సీస్ 5.14 కోట్లు
కర్ణాటక 5.00 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.3 కోట్లు
వరల్డ్ వైడ్ 65.19 కోట్లు
ఇది మెగాస్టార్ చిరంజీవి రేంజ్ వసూళ్లు కావు..ఎందుకంటే ఆయన రీ ఎంట్రీ తర్వాత చేసిన రెండు సినిమాలలో ఖైదీ నెంబర్ 150 మొదటి వారం లోనే 75 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.

ఇక ఆ తర్వాత చేసిన సై రా నరసింహరెడ్డి చిత్రం అయితే మొదటి వారం లోనే దాదాపుగా 114 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చాయి..గాడ్ ఫాదర్ కి ముందు చిరంజీవి నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి..అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న మెగాస్టార్ హిట్ సినిమాకి 65 కోట్ల రూపాయిల క్లోసింగ్ షేర్ అంటే మెగాస్టార్ రేంజ్ కి తక్కువే..కానీ ఎలాంటి హంగు మరియు ఆర్భాటాలు లేకుండా విడుదలైంది కాబట్టి,రీమేక్ సినిమా కాబట్టే ఆయన రేంజ్ వసూళ్లు రాలేదు..కానీ సంక్రాంతికి విడుదల అవ్వబొయ్యే వాల్తేరు వీరయ్య సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ తో మెగాస్టార్ చెడుగుడు ఆడుకుంటాడని అభిమానులు బలంగా చెప్తున్నారు..ఇటీవలే విడుదల చేసిన టీజర్ కి కూడా సెన్సషనల్ రెప్స్లోన్స్ వచ్చింది.