Godfather Collections Bollywood: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం నిన్న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుందో మన అందరికి తెలిసిందే..మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా లూసిఫెర్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కినప్పటికీ స్క్రీన్ ప్లే లో ప్రధానమైన మార్పులు చెయ్యడం తో ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాని చూస్తున్న అనుభూతిని కలిగించింది..అందుకే అంత మంచి పాజిటివ్ టాక్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది..లిమిటెడ్ రిలీజ్ మరియు అతి తక్కువ టికెట్ రేట్స్ తో విడుదల అయ్యినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతుంది..కేవలం తెలుగు లో మాత్రమే కాదు..ఈ సినిమా హిందీ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది..ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే ..అందుకే ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ కూడా హిందీ లో విడుదల చేసారు..అక్కడ కూడా రెస్పాన్స్ అదిరిపోయింది.

మొదటి రోజు ఈ సినిమాకి అక్కడ రెండు కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి..అసలు ఏ మాత్రం పబ్లిసిటీ లేకుండా ఈ స్థాయి వసూళ్లు హిందీ లో రాబట్టడం అంటే మాములు విషయం కాదు..ఇక ఈ వీకెండ్ కి అక్కడ షోస్ సంఖ్య కూడా బాగా పెంచనున్నారు..అందువల్ల ఈ చిత్రం కేవలం వీకెండ్ నుండే 20 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబడుతుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..అదే ఊపు ని కొనసాగిస్తే ఈ చిత్రం ఫుల్ రన్ లో 40 నుండి 50 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను కూడా రాబట్టే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి.

హిందీ లో ఇటీవల కాలం లో మన తెలుగు సినిమాలు దుమ్ములేపేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఆ సినిమాల జాబితాలోకి ‘గాడ్ ఫాదర్’ కూడా చేరిపోబోతుండడం తో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు..సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటించడం వల్ల ఈ విధంగా బాగా ప్లస్ అయ్యింది అనే చెప్పాలి.
[…] […]