https://oktelugu.com/

Megastar Chiranjeevi: సరికొత్త గెటప్ లో చిరంజీవి.. మెగా ఫ్యాన్స్ ఖుషీ..

తాజాగా ఆయన ‘విశ్వంభర’లో నటిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని గురించి ఓ హాట్ టాపిక్ హల్ చల్ చేస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : February 27, 2024 / 10:54 AM IST

    Vishwambara

    Follow us on

    Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఆల్ రౌండర్ యాక్టర్ గా పేరుంది. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోతారు. సినీ కెరీర్ లో ఆయన చేయని పాత్ర అంటూ ఏదీ లేదని చెప్పవచ్చు. విలన్ నుంచి ఓల్డ్ ఏజ్ వయసులో ఉన్న వారి వరకు అన్నింటిలోనూ నటించి మెప్పించాడు. తాజాగా ఈ మెగాస్టార్ ఊహించని గెటప్ లో కనిపించనున్నాడు. మెగాస్టార్ చిరు వరుసబెట్టి సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ‘విశ్వంభర’లో నటిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని గురించి ఓ హాట్ టాపిక్ హల్ చల్ చేస్తోంది.

    ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మిగతా సినిమాలకంటే ఈ మూవీ భిన్నంగా ఉంటుందని ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లింప్స్, ఫొటోస్ ను భట్టి తెలుస్తోంది. అయితే తాజాగా ఓ న్యూస్ మెగా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇందులో చిరంజీవ సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు. ఎవరూ ఊహించిన పాత్రలో యాక్ట్ చేయనున్నాడు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ విషయాన్ని కొందరు సినీ వర్గాలు బయటకు తెలిపారు.

    ‘విశ్వంభర’లో ఫ్లాష్ బ్యాక్ కీలకం కానుందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో మెగాస్టార్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో భాగంగా ఆయన 70 వ్యక్తి గెటప్ వేసుకోనున్నాడు. చిరంజీవి కెరీర్ లో మూడు పాత్రలు, తండ్రీ కొడుకుల పాత్రలు వేశారు. అయితే ఇవి సాధారణ వ్యక్తుల్లాగనే ఉన్నాయి. కానీ ఇప్పడు చిరంజీవి వేసే గెటప్ భిన్నంగా ఉంటుందని చర్చ సాగుతోంది.

    ‘విశ్వంభర’ కు సంబంధించిన వీడియోలు ఇప్పటికే రిలీజై హల్ చల్ చేస్తున్నాయి. ఒక దశలో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇటువంటి తరుణంలో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి చిరంజీవికి ఇప్పుడు 60 ఏళ్లకు పైగా వయసు ఉంటుంది. అంటే దాదాపు 70 ఏళ్ల వ్యక్తి పాత్రకు తగ్గట్టుగానే ఉంటుంది. అయితే ఈ గెటప్ లో చిరంజీవిఎలాంటి మేకప్ లేకుండా నటిస్తాడా? అనేది ఆసక్తిగా మారింది.