https://oktelugu.com/

Megastar ‘Acharya’ release date Confirmed !: డిసెంబర్లోనే మెగాస్టార్ ‘ఆచార్య’ రిలీజ్ !

Megastar ‘Acharya’ release date Confirmed !: తెలుగు చిత్రసీమలో దాదాపుగా అందరు మెగాస్టార్ చిరంజీవిని చూసే ఇండస్ట్రీకి వచ్చారు. మెగాస్టార్ సినిమా విడుదల అవుతుందంటే ప్రతి ఒక్క నిర్మాతలు వారి సినిమాలను పోస్టుపోన్ చేసుకునేవారు అలాంటిది చిరు క్రేజ్. కానీ ఇప్పుడు అందరి సినిమాల పుణ్యమా అని మెగాస్టార్ సినిమాకు విడుదల తేదీని నిర్ణయించలేకపోతున్నారు ఆచార్య సినిమా నిర్మాతలు. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మరియు మల్టీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 9, 2021 / 12:05 PM IST
    Follow us on

    Megastar ‘Acharya’ release date Confirmed !: తెలుగు చిత్రసీమలో దాదాపుగా అందరు మెగాస్టార్ చిరంజీవిని చూసే ఇండస్ట్రీకి వచ్చారు. మెగాస్టార్ సినిమా విడుదల అవుతుందంటే ప్రతి ఒక్క నిర్మాతలు వారి సినిమాలను పోస్టుపోన్ చేసుకునేవారు అలాంటిది చిరు క్రేజ్. కానీ ఇప్పుడు అందరి సినిమాల పుణ్యమా అని మెగాస్టార్ సినిమాకు విడుదల తేదీని నిర్ణయించలేకపోతున్నారు ఆచార్య సినిమా నిర్మాతలు. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మరియు మల్టీ స్టారర్ చిత్రం రిలీజ్ డేట్ విషయంలో గత కొన్ని రోజులుగా కాస్త బజ్ అలా వినిపిస్తుంది.

    మెగాస్టార్‌తో పాటు ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వీళ్లకు జంటగా కాజల్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు, పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 24న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేయనున్నామని రాజమౌళి ప్రకటించాడు. దీంతో డిసెంబ‌ర్17న రిలీజ్ అనుకున్నారు. కానీ సుకుమార్ మరియు బన్నీ కాంబోలో వస్తున్న పుష్ప అదే డేట్‌కి విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఆచార్య మూవీ విడుదలకు మళ్ళీ అడ్డంకి ఏర్పడింది.

    ఇప్పటికే కరోనాతో కుదేలైన సినిమా నిర్మాతలు భారీ బడ్జెట్ చిత్రాల కూడా రిలీజ్ డేట్స్ ముందుగానే ప్ర‌క‌టిస్తున్నాయి. కాని ఆచార్య చిత్ర విడుద‌లపై ఇంకా సందేహాలు నెల‌కొని ఉన్నాయి. అయితే ఈ డిసెంబర్ నెల 17 కే రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని టాక్ ఉన్నా, ఇంకా డేట్ మాత్రం పక్కాగా ఫిక్స్ కాలేదు. కానీ డైరెక్టర్ శివకు మాత్రం ఈ డేట్ కే సినిమాని రిలీజ్ చేయాలనీ ఉందట. కానీ పలు కారణాల చేత నిర్మాతలు ఇంకా ఈ తేదీనే కన్ఫర్మ్ చెయ్యాలా వద్దా అనే సందేహంలో ఉన్నట్టు టాక్. మొత్తానికి మెగా ఫ్యాన్స్ ఎప్పుడినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వస్తుందా లేక వచ్చే ఏడాది వస్తుందా అనేది ఇంకా ప్రశ్నార్ధకంగానే మిగిలి ఉంది.