https://oktelugu.com/

Ghani Movie Trailer Update: ట్రైలర్ అప్ డేట్ వచ్చింది.. ఇంతకీ మ్యాటర్ ఉంటుందా ?

Ghani Movie Trailer Update: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్‌ గా కనిపించనుండగా.. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రం ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 14, 2022 / 07:42 PM IST
    Follow us on

    Ghani Movie Trailer Update: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్‌ గా కనిపించనుండగా.. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రం ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రైలర్ అప్ డేట్ అయితే వచ్చింది గానీ, ఇంతకీ మ్యాటర్ ఉంటుందా ? చూడాలి.

    Varun Tej Ghani Movie Trailer Update

    బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహంతో అటు తిరిగి కనిపించిన వరుణ్ తేజ్ మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా పై అంచనాలను పెంచాడు. అయితే, ఈ సినిమాలో బాక్సర్‌ పాత్రలో నటించడానికి వరుణ్‌ తేజ్‌ కఠినమైన కసరత్తులు చేయాల్సి వచ్చింది. వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. పైగా కెరీర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు.

    అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గతంలో ‘బాలు’ అనే సినిమాలో చేసిన హీరో క్యారెక్టర్ పేరు ‘గని’నే. ఇప్పుడు వరుణ్ తేజ్, పవన్ సినిమా పేరును తన సినిమాకి టైటిల్ గా పెట్టుకోవడం విశేషం. వరుణ్ తేజ్ కి పవన్ పేర్లను వాడుకోవడం సెంటిమెంట్ అయిపోయింది. పవన్ సినిమా ‘తొలిప్రేమ’ టైటిల్ తోనే ఒక సినిమా చేసి వరుణ్ తేజ్ హిట్ కూడా కొట్టాడు. మరి ఇప్పుడు కూడా గనితో హిట్ కొడతాడేమో చూడాలి.

    Also Read: సూర్య ‘ఈటి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ !

    కాగా ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు, వీడియోలకు, పాటలకి ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు.

    ఇక ఈ సినిమాతో అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మాతగా మారబోతున్నాడు. సిద్దు అనే మరో నిర్మాతతో కలిసి బాబీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌ పై వస్తోన్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. కరోనా కారణంగా వెనుకబడింది.

    Also Read: ‘పవన్’ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది !

    Tags