
నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహం చైతన్య జొన్నలగడ్డతో ఈ డిసెంబర్ 9న ఉదయ్ పూర్ లోని ఉదయ్ ప్యాలెస్ లో జరుగనుంది. అయితే రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఈ పెళ్లి కోసం ఇప్పటికే వధూవరులు ఇరు కుటుంబాలతో వెన్యూ వద్దకు వెళ్లారు. నేటి ఉదయం చార్టెర్డ్ ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి పయనమైనప్పటి ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్‌లో ఉదయ్ పూర్ కు బయలుదేరిన ఫోటోలు, మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా పెళ్లికి హాజరయ్యేందుకు ఉదయ్ పూర్ చేరుకున్నప్పటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read: నిహారికతో చిరంజీవి.. నాగబాబు హాట్ కామెంట్స్ !

కాగా మరి కాసేపట్లో అతిథులంతా రాజస్థాన్ లోని వెన్యూ వద్దకు విచ్చేస్తారని తెలుస్తోంది. ఇక వీరికోసం ప్రత్యేకించి ఆ విలాసవంతమైన భవంతిలో ఖరీదైన సౌకర్యాలతో గదులన్నీ శానిటైజేషన్ తో సిద్ధంగా ఉన్నాయిని వార్తలు వస్తున్నాయి. ఇక తమ అభిమానుల కోసం మెగా ఫ్యామిలీ కూడా ఫోటోలు షేర్ చేస్తూ.. వాళ్ల ఫీలింగ్స్ గురించి అప్ డేట్ ఇస్తూ మొత్తానికి ఫ్యాన్స్ ను కూడా ఉత్సాహంగా ఉంచుతున్నారు. చరణ్ పోస్ట్ చేస్తూ.. ‘బాస్ చిరు ఫొటో ఉన్న మాస్కు ధరించానంటూ చెర్రీ ఓ స్టిల్ పోస్ట్ చేశాడు.
Also Read: పెళ్లి కుమార్తెగా నిహారిక.. వైరల్ అవుతున్న ఫోటోలు !

అలాగే బన్నీ కూడా చాలా ఏళ్ల తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి విమానంలో ప్రయాణిస్తున్నామని, పెళ్లి సంబరం మొదలైందని ఫొటోలు పోస్ట్ చేస్తూ..‘అయాన్ .. చిలిపి కుర్రాడు, అర్హ.. అల్లు దివా, స్నేహా.. క్యూటీ’ అని కామెంట్ కూడా పెట్టాడు. ఇక విమానంలో తనకు కాబోయే భర్త చైతన్యతో కలిసి దిగిన ఫోటోను
నిహారిక షేర్ చేస్తూ.. ‘ఉత్సాహంతో కూడిన ప్రయాణానికి సిద్ధంగా ఉన్నావా?” అంటూ కాబోయేభర్తను చిలిపిగా ప్రశ్నించింది. కరోనా తరువాత మెగా కుటుంబం మొత్తం కలిసి చేస్తోన్న వేడుక కావడంతో ఈ పెళ్లి పై అందరి దృష్టి ఉంది. ఇక ఎప్పటిలాగే ఈ హడావిడిలో పవర్ స్టార్ కనబడలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్