Mega Family: ఇటీవల మెగా కుటుంబానికి చెందిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి నుంచి నిన్నటి దీపావళి వరకు ఈ కుటుంబం ఏం చేసిన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా మెగా కుటంబానికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ అయింది. మెగా కుటుంబానికి చెందిన పిల్లలంతా ఒక్క చోటుకు చేరారు. వీరు సరదాగా ఓ పిక్ తీసుకున్నారు. అయితే ఈ ఫొటోను బాలల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి మన కుటుంబానికి చెందిన మనువళ్లు, మనువళ్లు ఉన్నారు.
కొన్నేళ్లుగా సినిమాల బిజీలో పడి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు కలుసుకోవడానికి వీలు కాలేదు. ఇటీవల వరుణ్ తేజ్ వివాహం సందర్భంగా అంతా ఒక్కచోటుకు చేరారు. వరుణ్ తేజ్, లావణ్యల వివాహం ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఈ పెళ్లికి హాజరయ్యారే వీరంతా ఒకే ప్రేమ్ లో ఫొటో దిగి సందడి చేశారు.
ఆ తరువాత వివాహ రిసెప్షన్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మరోసారి మెగా కుటుంబ సభ్యులంతా ఒకే ఫ్రేములో కనిపించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మనువళ్లు, మనువరాళ్లు అంతా కలిసి ఓ పిక్ దిగారు. దీనిని చిరంజీవి చిన్న చిన్నకూతురు శ్రీజ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇందులో మెగా హీరో రామ్ చరణ్ కూతురు క్లింకార లేకపోవడం గమనార్హం.
ఈ సందర్భంగా మెగా వారసురాలు ఎక్కడా? అని ఈ పిక్ చూసిన వారు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ఫొటోతో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కొందరు శుభాకాంక్షలు చెబుతుండగా.. మరికొందరు గుడ్ పిక్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇటీవల టాలీవుడ్ లెజెండ్స్ మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేశ్, నాగార్జున ఒకే ఫ్రేమ్ లో కనిపించిన సందడి చేశారు.